ETV Bharat / entertainment

మరో 'అన్​స్టాపబుల్'​ ట్విస్ట్.. పవన్ ఎపిసోడ్ ఇప్పుడే కాదంట.. సంక్రాంతికి స్పెషల్ ప్లాన్..!

author img

By

Published : Jan 3, 2023, 1:34 PM IST

Updated : Jan 3, 2023, 1:48 PM IST

nbk unstoppable with pawan kalyan
nbk unstoppable with pawan kalyan

అన్​స్టాపబుల్​ దూసుకెళ్తున్న్ ఎన్​బీకే షోలో పవన్​ కల్యాణ్​ ఎంట్రీ ఇచ్చారన్న వార్త తెలియగానే ఫ్యాన్స్ ఉత్సాహం రెట్టింపయ్యింది. ప్రభాస్​ ఎపిసోడ్​ తర్వాత మోస్ట్​ అవెయిటింగ్​ ఎపిసోడ్​గా పవన్​ ఎపిసోడ్​ నిలుస్తున్న సమయంలో ఆహా సంస్థ ఫ్యాన్స్​కు ఓ షాకింగ్​ న్యూస్​ ఇచ్చింది. అదేందంటే.

టాలీవుడ్​లో రిలీజైన అన్ని టాక్​ షోలకు బాప్​గా నిలుస్తున్న ఎన్​బీకే అన్​స్టాపబుల్-2​..ఒక్కో ఎపిసోడ్​కు సర్ప్రైజింగ్​ గెస్ట్​లను తెస్తూ ఓ రేంజ్​లో దూసుకెళ్తోంది. బాలయ్య ఎనర్జటిక్​ హోస్టింగ్​కు గెస్ట్​ల అన్​స్టాపబుల్​ ముచ్చట్ల తోడవ్వడం వల్ల ఈ షో మరింత ఉత్సాహంగా సాగుతోంది. ఇప్పటికే రిలీజైన ప్రభాస్​ ఎపిసోడ్.. గ్లింప్స్ లెవెల్​ నుంచే ఓటీటీని షేక్​ చేయగా.. తాజాగా అన్​స్టాపబుల్​కు పవర్​స్టార్​ పవన్​ కల్యాణ్​ రానున్నారు అన్న వార్తతో పీఎస్పీకే అభిమానులు ఆనందంతో పొంగిపోయారు. అప్పటి నుంచి ఎపిసోడ్​కు సంబంధించిన ఒక్కో అప్డేట్​ కోసం వేయి కన్నులతో ఎదురుచూస్తున్నారు. అయితే ఇటీవలే వచ్చిన ఓ అప్డేట్​తో ఫ్యాన్స్ షాక్​కు గురయ్యారు.

'జనవరి 2023 మన బాలయ్యదే'.. అని ఆహా సంస్థ పోస్ట్​ చేసిన ఓ ట్వీట్​లో 'అన్​స్టాపబుల్'​లో స్ట్రీమ్​ కానున్న అన్ని ఎపిసోడ్ల లిస్ట్​ ఉంది. అందులో 'పీఎస్​పీకే x ఎన్​బీకే' ఎపిసోడ్​ కమింగ్​ సూన్​ అని రాసుంది. అయితే అది ఎప్పుడు అని మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అయితే షెడ్యూల్​లో మాత్రం జనవరి 13 వరకు ప్రభాస్ ఎపిసోడ్​తో పాటు 'వీరసింహారెడ్డి' స్పెషల్​ ఎపిసోడ్​ గురించి ప్రస్థావించారు. దీంతో జనవరి 13 తర్వాతనే మిగిలిన ఎపిసోడ్స్ వస్తాయని ఫ్యాన్స్​ అభిప్రాయపడుతున్నారు. ఏదైమైనప్పటికీ పవన్​ ఎపిసోడ్​ కొంచం లేట్​గా వస్తుందన్న వార్తతో అభిమానులు ఒక్కసారిగా షాక్​కు గురయ్యారు.

Last Updated :Jan 3, 2023, 1:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.