HarishRao Fires on Congress : రాష్ట్రంలో అధికారంలోకి వస్తామంటూ కాంగ్రెస్ పగటి కలలు కంటోందని మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. నలభై, యాభై స్థానాల్లో ఆ పార్టీకి అభ్యర్థులే లేరని విమర్శించారు. నిన్న జడ్చర్లలో హస్తం నేతలు చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. నిరుద్యోగం కాంగ్రెస్ నాయకులకే ఉందని వ్యంగాస్త్రాలు సంధించారు. ఎవరెన్ని తప్పుడు ప్రచారాలు చేసినా.. తెలంగాణలో మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రం నంబర్ వన్‌గా ఉంది : ఈ క్రమంలోనే తెలంగాణ అంతటా అభివృద్ధి జరుగుతోందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఇందుకు నిదర్శనంగా పంచాయతీరాజ్ శాఖకు.. పలు అవార్డులు వచ్చాయని గుర్తు చేశారు. వివిధ రంగాల్లో పనిచేసినందుకే కేంద్రం అవార్డులు ఇస్తోందని తెలిపారు. దేశంలోనే రాష్ట్రం నంబర్ వన్‌గా నిలిచిందని వివరించారు. కాంగ్రెస్, బీజేపీని.. బీఆర్ఎస్ కార్యకర్తలు విషయ పరిజ్ఞానంతో ఎదుర్కొవాలని హరీశ్‌రావు సూచించారు.
మూడోసారి కూడా అధికారంలోకి : గతంలో ఆసుపత్రుల్లో 17,000 పడకలు ఉంటే.. కేసీఆర్ వచ్చాక దానిని 50,000 పడకలకు పెంచారని హరీశ్‌రావు తెలిపారు. మూడోసారి కూడా కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. అంతకుముందు హరీశ్‌రావు మిర్యాలగూడ నియోజకవర్గంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిలో చిన్నపిల్లల ట్రామాకేర్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు.
ఈ క్రమంలోనే ఏరియా ఆసుపత్రిలో అదనంగా రూ.14 కోట్లతో నూతనంగా నిర్మించనున్న.. 100 పడకల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగానే మిర్యాలగూడకు బ్లడ్ బ్యాంక్‌ను మంజూరు చేస్తామని ఆయన వివరించారు. అలాగే పట్టణంలోని పలు వార్డులలో ఏర్పాటు చేసిన 28 హెల్త్ సబ్‌సెంటర్‌లను, ఇందిరమ్మ కాలనీలో బస్తీ దవాఖానాను ప్రారంభించారు. అనంతరం వేములపల్లి గ్రామ పంచాయతీ భవనాన్ని హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కరరావు, రవీందర్ నాయక్, కంచర్ల భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
"మిర్యాలగూడకు బ్లడ్ బ్యాంక్‌ను మంజూరు చేస్తాం. తెలంగాణ అంతటా అభివృద్ధి జరుగుతోంది. పంచాయతీ రాజ్ శాఖలో పలు అవార్డులు వచ్చాయి. వివిధ రంగాల్లో పనిచేసినందుకే కేంద్రం అవార్డులు ఇస్తోంది. దేశంలో తెలంగాణ నంబర్ వన్‌గా ఉంది. కాంగ్రెస్, బీజేపీని బీఆర్ఎస్ కార్యకర్తలు విషయ పరిజ్ఞానంతో ఎదుర్కొవాలి. గతంలో ఆసుపత్రుల్లో 17,000 పడకలు ఉంటే.. కేసీఆర్ వచ్చాక 50,000 పడకలకు పెంచారు. మూడోసారి అధికారంలోకి కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది." - హరీశ్‌రావు, మంత్రి
ఇవీ చదవండి: Congress Public Meeting in Jadcherla : 'తొమ్మిదేళ్ల BRS పాలనలో జనానికి ఒరిగింది శూన్యం'
Niranjan Reddy counter attack On Congress : 'కాంగ్రెస్‌లో అంతా కట్టప్పలే.. 'పాలమూరు' పాపం వారిదే'
కొత్త పార్లమెంట్ ఓపెనింగ్‌పై పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు