Niranjan Reddy counter attack On Congress : 'కాంగ్రెస్​లో అంతా కట్టప్పలే.. 'పాలమూరు' పాపం వారిదే'

author img

By

Published : May 26, 2023, 1:13 PM IST

Niranjan Reddy

Minister Niranjan Reddy counter attack On Congress : కాంగ్రెస్​ పార్టీలో అందరూ కట్టప్పలేనని.. పాలమూరు ప్రాజెక్టులు నిర్లక్ష్యం చేసి.. పాలమూరు ప్రజలను వలసలు, ఆకలిచావులు, ఆత్మహత్యల పాలు చేశారని మంత్రి నిరంజన్​ రెడ్డి ధ్వజమెత్తారు. జడ్చర్లలో జరిగిన కాంగ్రెస్​ బహిరంగ సభలో ఆ పార్టీ నాయకులు బీఆర్​ఎస్​పై చేసిన విమర్శలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

18599558

Minister Niranjan Reddy counter attack On Congress :కాంగ్రెస్​ పార్టీ నేతలు నోటి కొచ్చినట్లు మాట్లాడడం మానేసి.. తమ పాలనలో పాలమూరు జిల్లాలో జరిగిన అన్యాయానికి అక్కడి ప్రజలకు క్షమాపణలు చెప్పాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​ రెడ్డి అన్నారు. జడ్చర్ల బహిరంగ సభలో కాంగ్రెస్​ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం చేసిన విమర్శలపై మంత్రి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నాలుగున్నర దశాబ్దాల కాంగ్రెస్​ పాలన పాపమే.. పాలమూరు వలసలు, ఆకలి చావులు, ఆత్మహత్యలు అని ఆక్షేపించారు. మరి ఇప్పుడు ఆ పార్టీ నేతలు ఏం ముఖం పెట్టుకొని అక్కడి ప్రజలను ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు.

కర్ణాటక ఫలితాలు ఇక్కడా వస్తాయంటే.. ఎలా : నాలుగున్నరేళ్ల కేసీఆర్​ అభివృద్ధి పరమైన పాలనను చూసి.. 2018లో ఉమ్మడి పాలమూరు ప్రజలు 14 స్థానాలకు 13 స్థానాలు కట్టబెట్టారని మంత్రి నిరంజన్​ రెడ్డి గుర్తు చేశారు. ఇప్పటికీ కాంగ్రెస్​ పార్టీకి ఈ జిల్లాలో స్థానం లేదని అన్నారు. మరో ఆరు నెలల్లో వచ్చే ఎన్నికల్లోనూ.. తెలంగాణ ప్రజలు బీఆర్​ఎస్​ పార్టీకే పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పాదయాత్ర చేస్తున్న కాంగ్రెస్​ నాయకులకు ఆ యాత్రలో రహదారుల వెంట.. ఊళ్లలో ఎక్కడా.. కేసీఆర్​ చేసిన అభివృద్ధి కనిపించలేదా అని ప్రశ్నించారు. కర్ణాటక ఫలితాలను చూసి కాంగ్రెస్​ నేతలు పగటి కలలు కంటున్నారని.. ఆ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం లేకే ప్రజలు కాంగ్రెస్​ పార్టీకి అధికారాన్ని అప్పగించారని చెప్పారు

"రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీ చేసే పాదయాత్రలను ప్రజలు.. నాయకత్వం కోసం చేసే పాదయాత్రలుగా గుర్తిస్తున్నారు. కాంగ్రెస్​ పార్టీ మాటలు ఆశ్చర్యంగా ఉన్నాయి. పాలమూరు జిల్లానే కాదు.. తెలంగాణ మొత్తం ప్రాంతాన్ని ఐదు దశాబ్దాలు అధికారంలో ఉండి జిల్లా వెనుకబాటుకు, తెలంగాణ వెనుకబాటుకు కారణమయ్యారు. తెలంగాణ సమాజం కాంగ్రెస్​ పార్టీని క్షమించదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ముందుకు కదలకుండా అడ్డుకట్ట వేసిందే కాంగ్రెస్​. కోర్టుల్లో కేసులు వేసి ప్రాజెక్టును అడ్డుకున్నారు." - నిరంజన్​ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి

కాంగ్రెస్​ పార్టీ నిర్లక్ష్య శాపమే.. పాలమూరు వెనుకబాటు : కాంగ్రెస్ పార్టీలో అందరూ కట్టప్పలేనని.. పాలమూరు ప్రాజెక్టులు నిర్లక్ష్యం చేసి, పోతిరెడ్డిపాడుతో వెన్నుపోటు పొడిచి, పాలమూరు ప్రజలను వలసలు, ఆకలిచావులు, ఆత్మహత్యల పాలు చేశారని నిరంజన్​ రెడ్డి ధ్వజమెత్తారు. అధికారంపై కాంగ్రెస్ దింపుడుకళ్లెం ఆశతో ఉందని.. ఈసారి ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మాదిరే అవుతుందని ఎద్దేవా చేశారు. త్వరలో పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసి ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్​.. నీరు, ఉపాధి అవకాశాలు అన్నీ ఇచ్చారని వివరించారు. కేసీఆర్​ రాకతో పల్లెలు, పట్టణాలు బాగుపడ్డాయని.. దేశంలో నంబర్​ 1 రాష్ట్రంగా తెలంగాణ కొనసాగుతోందని మంత్రి నిరంజన్​ రెడ్డి అన్నారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.