ETV Bharat / state

ఎర్రకోటపై రైతుజెండా మోదీకి చెంపపెట్టు: చాడ, తమ్మినేని

author img

By

Published : Jan 27, 2021, 8:05 PM IST

దిల్లీలో రైతుల ట్రాక్టర్ ర్యాలీ విజయవంతమైందని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు చాడ వెంకటరెడ్డి, తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఎర్రకోటపై రైతుజెండా ఎగరేయడం కేంద్ర ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వామపక్ష అభ్యర్థి జయసారథిరెడ్డిని గెలిపించాలని కోరారు.

graduates-mlc-meeting-in-nalgonda-district-under-left-party-leaders
ఎర్రకోటపై రైతుజెండా మోదీకి చెంపపెట్టు: చాడ, తమ్మినేని

దిల్లీలో రైతు ఉద్యమం తారాస్థాయికి చేరిందని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు చాడ వెంకటరెడ్డి, తమ్మినేని వీరభద్రం అన్నారు. ట్రాక్టర్ ర్యాలీకి అనూహ్య మద్దతు లభించిందని చెప్పారు. అనుకున్నదానికంటే ఎక్కువగానే రైతులు స్వచ్ఛందంగా ర్యాలీలో పాల్గొన్నారని తెలిపారు. నల్గొండలోని ఎంఎన్​ఆర్ ఫంక్షన్ హాల్​లో నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ విస్త్రతస్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం చాడ, తమ్మినేని మీడియాతో మాట్లాడారు.

అది ముమ్మాటికీ మోదీ కుట్రే...

దిల్లీలో రైతుల ట్రాక్టర్ ర్యాలీని కావాలనే పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని చాడ, తమ్మినేని ఆరోపించారు. రైతు ఉద్యమాన్ని దెబ్బతీసేందుకు మోదీ కుట్ర పన్నారని ఆరోపించారు. అందులో భాగంగానే ర్యాలీలోకి కొన్ని శక్తులను ప్రవేశపెట్టి.. పరిస్థితిని ఉద్రిక్తంగా మార్చేశారని విమర్శించారు. ఇకనైనా కేంద్రం దిగివచ్చి, సాగు చట్టాలను రద్దుచేయాలని డిమాండ్ చేశారు.

ప్రశ్నించే గొంతుకనే గెలిపించండి...

నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రశ్నించే గొంతుకే అవకాశం ఇవ్వాలని వారు కోరారు. వామపక్ష అభ్యర్థి విజయసారథిరెడ్డిని గెలిపించాలని విన్నవించారు. విజయసాయిరెడ్డిని గెలిపిస్తే.. విద్యావంతుల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తారని తెలిపారు.

ఇదీ చూడండి : పీఆర్సీపై తుది నిర్ణయం ముఖ్యమంత్రిదే: శ్రీనివాస్ గౌడ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.