ETV Bharat / state

మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రి ముందు.. సీపీఎం ధర్నా

author img

By

Published : Jul 2, 2020, 4:15 PM IST

CPM Protest At Miryalaguda Area Hospital
మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రి ముందు.. సీపీఎం ధర్నా

మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిలో పూర్తిస్థాయి వైద్య సిబ్బందిని నియమించి, స్థానికంగానే కరోనా పరీక్షలు నిర్వహించి, వైద్య సేవలు అందించాలని ఆస్పత్రి ముందు సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సిబ్బంది, పరికరాల కొరతతో రోగులు ఇబ్బంది పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని సీపీఎం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిలో పూర్తిస్థాయి వైద్య సిబ్బందిని నియమించాలని, స్థానికంగానే కరోనా పరీక్షలు నిర్వహించి, వైద్యసేవలు అందించాలని ఆస్పత్రి ముందు సీపీఎం పార్టీ ధర్నా నిర్వహించింది. వైద్య పరికరాలు లేకి, సిబ్బంది కొరతతో రోగులు ఇబ్బందులు పడుతున్నారని, సీజనల్​ వ్యాధులు ప్రబలే ఈ సీజన్​లో వైద్య సిబ్బంది సరిపడా లేకపోవడం వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు.

లాక్​డౌన్ అనంతరం మిర్యాలగూడ పరిసర ప్రాంతాల్లో 25 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, స్థానికంగా 100 పడకల ఏరియా ఆస్పత్రి ఉన్నా.. 50 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆరోపించారు. వైద్య పరికరాలు లేక సిబ్బంది పేదలకు పూర్తి స్థాయిలో వైద్యం అందించలేక పోతున్నారని అన్నారు. తెలంగాణలో కేసులు పెరుగుతున్నా కేసీఆర్ ఏమి జరగనట్టు మాట్లాడుతున్నారని, కరోనా పరీక్షలు నిర్వహించడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జూలకంటి రంగారెడ్డి ఆరోపించారు. రెండోసారి లాక్ డౌన్ విధించే దిశగా ఆలోచన చేస్తున్నారని, అదొక్కటే పరిష్కారం కాదని అన్నారు. అధిక సంఖ్యలో కరోనా పరీక్షలు నిర్వహించి పేద ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరారు. మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్ లో వెంటనే వైద్య సిబ్బందిని నియమించి వైద్య పరికరాల సమకూర్చాలని డిమాండ్ చేశారు.

ఇద చదవండి: పాఠశాలల ప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: విద్యాశాఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.