ETV Bharat / state

A Person Get Two Government Jobs : రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి.. ఆదర్శంగా నిలుస్తోన్న యువకుడు

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 17, 2023, 5:44 PM IST

Young Man Got Two Jobs at a Time
Young Man Got Two Central Government Jobs

A Person Get Two Government Jobs in Nalgonda : తల్లికి అనారోగ్యం.. తండ్రి లారీ డ్రైవర్​. కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా గొప్పదేమి కాదు. మరీ.. తన భవిష్యత్​ ఏమిటని ఆలోచించసాగాడు. అప్పుడే తన సోదురుడు ఆ యువకుడికి అండగా నిలిచాడు. కుటుంబం గౌరవంగా బతకాలంటే ప్రభుత్వ ఉద్యోగం తప్పనిసరని ప్రోత్సహించాడు. దీంతో ఆ యువకుడు కుటుంబ గౌరవమే లక్ష్యంగా రెండు కొలువులు సాధించి..శభాష్​ అనిపించుకుంటున్నాడు సురేశ్​​.

Young Man Got Two Government jobs రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన సురేశ్​

A Person Get Two Government Jobs in Nalgonda : సురేశ్​ అనే యువకుడు నల్గొండ జిల్లాలోని వేములపల్లి మండలం మొల్కపట్నం గ్రామానికి చెందినవాడు. చిన్నప్పటి నుంచి చదవులో చురుకుగా ఉండేవాడు. ఎంసెట్​లో మంచి ర్యాంక్​ సాధించి ఇంజినీరింగ్​ సాధించాడు. అనంతరం మంచి సాఫ్ట్ వేర్​ కంపెనీలో ఉద్యోగం లభించినా.. తల్లిదండ్రుల కోరిక మేరకు ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా అహర్నిశలు శ్రమించాడు. సురేశ్​ రెండు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించగా.. అందులో ఒకటి రైల్వే ఉద్యోగం(Railway Job) కాగా మరోకటి ఇన్​కమ్​ట్యాక్స్​ ఆఫీసర్​. స్టాఫ్​సెలక్షన్​ కమిషన్​లో 1190వ ర్యాంక్​ సాధించడం తనకి ఎంతో సంతోషాన్ని కలిగించందని చెప్పాడు. అయితే ఈ కొలువు సాధించేందుకు నాలుగు సార్లు విఫలమైయ్యాడని తెలిపాడు. పట్టువిడవకుండా ప్రయత్నం చేయడం వల్లే విజయం సాధించానని చెబుతున్నాడు.

"ప్రతిసారి ఎగ్జామ్​ ఫెయిల్​ అయిపోయేవాడ్ని.. జాబ్​ సాధించగలనా.. లేదా అని భయం వేసింది. 5వసారి మళ్లీ ప్రయత్నించాను. మంచి ర్యాంక్​ వచ్చింది. ఇది ప్రిపేర్​ అవుతున్న సమయంలోనే రైల్వే గ్రూప్​-డి ఎగ్జామ్​ అయింది. అది కాడా సాధించాను. ప్రస్తుతం గుంటూరు డివిజన్​ వెనుకొండ సెక్షన్​లో ఉద్యోగం చేస్తున్నాను. కష్టాలు వచ్చాయని ఆగిపోకండా.. ఎలాగైన చదవడం కొనసాగించండి. లక్ష్యానికి దారులు అవే కనిపిస్తాయి. అలా చదవడం వల్లే ఇప్పుడు నా తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టాను." - సురేశ్​, రెండు కొలువుల విజేత

SI Hemalatha interview in Tealangana : 'నా విజయంలో కుటుంబంతో పాటు ఈనాడు పేపర్ కీలకంగా నిలిచింది'

How to prepare Government Jobs : లక్షలు మంది పోటీపడుతున్న ఎగ్జామ్​లో.. తాను గెలవడం ధైర్యాన్ని ఇచ్చిందని తెలిపాడు. ఎన్నో కష్టాలు దాటి ఉద్యోగం సాధించడం తన జీవితంలో ఓ మైలు రాయని కన్నీటిపర్యంతం అయ్యాడు​. సురేశ్​ డిప్రెషన్​లో ఉన్నప్పుడు తన సోదరుడు ధైర్యాన్ని ఇచ్చేవాడని పేర్కొన్నాడు. అన్నతో పాటు వదినా, తల్లిదండ్రులు సహకారమే తన విజయానికి కారమని తెలిపాడు. తనతో పాటు ఎంతో మంది పోటీ పడుతున్న నిరుద్యోగులకు తనదైన శైలిలో సూచనలు ఇస్తున్నాడు. ప్రస్తుతం గుంటూరు రైల్వే డివిజన్(Guntur Railway Divison) పరిధిలో విధులు నిర్వహిస్తున్నాడు. తమ వాడు ప్రయోజకుడు అవ్వడంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

"తమ్ముడు జాబ్​ సంపాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించమని కోచింగ్​కి పంపించాను. అందులో ఎస్ఎస్​సీ ఎంచుకున్నాడు. చదువేందుకు చాలా కష్టపడ్డాడు. దానికి ఈరోజు ప్రతిఫలం దక్కింది. ఇంతక మించిన ఆనందం మాకు ఏమి ఉండదు." -నరేశ్​, సురేశ్​ సోదరుడు

Suggestions to Prepare Government Jobs : 'కష్టాలను నిన్ను కుంగదీసేందుకు కాదు నీలోని బాహ్య శక్తులను బయట ప్రపంచానికి తెలియజేసేందుకే వస్తాయి' అన్న మహానుభావులు చెప్పిన మాటలే సురేశ్​కి స్ఫూర్తిని నింపాయి. కష్టాలను వారిధిగా చేసుకోని ముందుకు సాగుతేనే విజయతీరాలకు చేరుకోగలమని సురేశ్​ నిరూపించాడు.

Rangareddy Avocado Farmer Interview : రూ.లక్షలు వచ్చే ఉద్యోగాలు వదిలి 'అవకాడో పంట' సాగు.. ఇప్పుడు అంతకు మించి..!

Young cloud Photographer in Hyderabad : ఫొటోలతో మేఘ సందేశం.. చూస్తే వావ్​ అనాల్సిందే..!

Interview with Poet Pranavi : 'సమాజంలో మార్పు కోసమే నా రచనలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.