ETV Bharat / state

అమ్మవార్లను దర్శించుకుని ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

author img

By

Published : Jan 29, 2020, 3:23 PM IST

collector-rv-karnan-visited-medaram-and-examined-the-jatara-arrangements
మేడారంలో అమ్మవార్లను దర్శించుకుని.. ఏర్పాట్ల పరిశీలన

కలెక్టర్ ఆర్వీ కర్ణన్​ మేడారం అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం జాతర ఏర్పాట్లను ఆయన దగ్గరుండి పరిశీలించారు.

ములుగు జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్​ జాతర ఏర్పాట్లను పరిశీలించారు. క్యూలైన్లలో భక్తుల రద్దీని చూశారు. మేడారం జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

ఇన్​ఛార్జి కలెక్టర్​గా బాధ్యతలు చేపట్టిన కర్ణన్ నేరుగా మేడారం వచ్చి సమ్మక్క సారలమ్మల దర్శనం చేసుకున్నారు. ఈనెల 31 లోపు అన్ని పనులు పూర్తి చేసి జాతరకు సంసిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.

మేడారంలో అమ్మవార్లను దర్శించుకుని.. ఏర్పాట్ల పరిశీలన

ఇదీ చూడండి: 'నిర్భయ' కేసులో మరో దోషి క్యురేటివ్​ పిటిషన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.