ETV Bharat / state

విద్యుదాఘాతంతో నేపాలీ మహిళ మృతి

author img

By

Published : Mar 3, 2021, 11:01 PM IST

బట్టలు ఆరేస్తుండగా.. ప్రమాదవశాత్తు కరెంట్​షాక్​ తగిలి ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన మేడ్చల్​ జిల్లా ఓల్డ్​ బోయిన్​పల్లిలో జరిగింది.

woman dies of electrocution in old boinpalli
విద్యుదాఘాతంతో నేపాలీ మహిళ మృతి

మేడ్చల్​ జిల్లా ఓల్డ్​ బోయిన్​పల్లి పరిధిలో.. విద్యుదాఘాతంతో ఓ మహిళ మృతి చెందింది. బాల్కానీలో చీర ఆరేస్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.

నాగిరెడ్డి కాలనీలోని ఫార్చ్యూన్ హైట్స్ అపార్ట్​మెంట్​లో.. నేపాల్​కు చెందిన జానకి (29) పనిమనిషిగా చేస్తోంది. రెండో అంతస్థులో ఉన్న ఓ ఫ్లాట్లో.. బాల్కానీలో బట్టలు ఆరేసే క్రమంలో.. చీర అపార్ట్​మెంట్​కు సంబంధించిన ట్రాన్స్ ఫారంపై పడింది. షాక్​కు గురైన మహిళ.. అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.

సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి: కట్టుకున్న భార్యపై ముళ్ల పొదల్లోకి లాక్కెళ్లి హత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.