ETV Bharat / state

రెండు అంబులెన్స్​లను ప్రారంభించిన సీపీ మహేష్​ భగవత్​

author img

By

Published : Aug 17, 2020, 7:22 PM IST

రాచకొండ కమిషనరేట్​ కార్యాలయంలో సీపీ మహేష్​ భగవత్​ రెండు అంబులెన్సులను ప్రారంభించారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారు ఈ సర్వీసులను వినియోగించుకోవాలని తెలిపారు.

rachakonda cp mahesh bhagavat inaugurated emergency ambulance services
రెండు అంబులెన్స్​లను ప్రారంభించిన సీపీ మహేష్​ భగవత్​

రాచకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో రెండు అత్యవసర సర్వీసులను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ప్రారంభించారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటి కౌన్సిల్ ఆధ్వర్యంలో ఒక అంబులెన్స్​, యువత ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మరో అంబులెన్స్​ను ప్రారంభించారు.

రాచకొండ పోలీస్ కమిషనరేట్​లో ఉన్న యాదాద్రి భువనగిరి, మల్కాజిగిరి, ఎల్బీ నగర్​ ప్రాంతాల్లోని వారు ఈ సర్వీసులను ఉపయోగించుకోవాలని అన్నారు. కొవిడ్-19 నేపథ్యంలో 108 సర్వీసులు దొరకడం లేదని.. ఎవరైనా అత్యవసర సమయంలో ఉన్నవారు ఈ సర్వీసులను వాడుకోవాలని అన్నారు.

ఇవీ చూడండి: వరదలపై ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యున్నత స్థాయి సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.