ETV Bharat / state

జనసేన జెండా తొలగించారంటూ ఫిర్యాదు

author img

By

Published : Oct 30, 2020, 9:05 AM IST

మేడ్చల్ జిల్లా చర్లపల్లి డివిజన్​లోని కుషాయిగూడ బస్టాండ్ వద్ద జనసేన జెండాను తొలగించారంటూ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పది రోజుల క్రితం గ్రేటర్ హైదరాబాద్ జనసేన అధ్యకులు జెండాను ఆవిష్కరించారు. జెండాను తొలగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

Janasena flag disbursed in kushaiguda bustand compliat to police
జనసేన జెండా తొలగించారంటూ ఫిర్యాదు

మేడ్చల్ జిల్లా చర్లపల్లి డివిజన్​లోని కుషాయిగూడ బస్టాండ్ జనసేన జెండాను తొలగించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ పార్టీ నాయకులు. పది రోజుల క్రితమే గ్రేటర్ హైదరాబాద్ జనసేన అధ్యక్షులు జెండాను ఆవిష్కరించారు. రెండు రోజుల కిందట గుర్తు తెలియని వ్యక్తులు జెండాను తొలగించారు.

జెండాను తొలగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కుషాయిగూడ పోలీసులకు జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు. రాబోయే జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో ఈ డివిజన్​లో తామే గెలుస్తామని జనసేన చర్లపల్లి డివిజన్​ అధ్యక్షులు కార్తీక్ తెలిపారు.

ఇదీ చూడండి:దుబ్బాకలో తారస్థాయికి చేరుకున్న ఉపఎన్నిక పోరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.