ETV Bharat / state

నిరాడంబరంగా భగీరథ జయంతి వేడుకలు

author img

By

Published : May 19, 2021, 7:34 PM IST

మెదక్ జిల్లా కలెక్టరేట్​లో నిరాడంబరంగా భగీరథ జయంతి వేడుకలు నిర్వహించారు. కలెక్టర్​ హరీశ్​ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి.. నివాళులర్పించారు.

Bhagiratha birth anniversary
Bhagiratha birth anniversary

గంగా జలాన్ని అందించిన మహాపురుషుడు భగీరథుడు, ఆయన మానవాళికి చేసిన మేలును స్మరించుకోవడం మన ధర్మమని జిల్లా కలెక్టర్​ యస్​. హరీశ్​ అన్నారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం మెదక్ జిల్లా కలెక్టరేట్​లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్​ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి.. నివాళులర్పించారు.

ఏటా వైశాఖ శుద్ధ సప్తమి రోజున నిర్వహించుకునే ఈ జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని.. కాగా ప్రస్తుతం కరోనా నేపథ్యంలో వేడుకలను కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిరాడంబరంగా నిర్వహిస్తున్నామని అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.