ETV Bharat / state

ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి : కొండల్​రెడ్డి

author img

By

Published : Jan 23, 2021, 6:35 PM IST

ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీపీటీఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కొండల్​రెడ్డి డిమాండ్ చేశారు. పదోన్నతులు, బదిలీలు వెంటనే చేపట్టాలని కోరారు. రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల పిలుపుతో మెదక్​ కలెక్టరేట్​ ముందు ఒక్కరోజు నిరాహారదీక్షకు దిగారు.

jacto dharna at medak collectorate for demands of Teachers  need to be solved
డిమాండ్ల సాధన కోసం మెదక్​ కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన

రాష్ట్రంలో పదోన్నతులు, బదిలీలు సత్వరమే చేపట్టాలని టీపీటీఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కొండల్ రెడ్డి డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని జాక్టో ఆధ్వర్యంలో మెదక్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల పిలుపుతో ఒక్కరోజు నిరాహారదీక్ష చేపట్టారు.

ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి, ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఫిబ్రవరిలో రాష్ట్ర స్థాయిలో ఉద్యోగులందరూ ప్రత్యక్ష కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ నెలాఖరులోగా ఉద్యోగ సంఘాలతో చర్చించి ఆమోదయోగ్యమైన ఫిట్​మెంట్​తో నూతన వేతనాల అమలుకు ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కోరారు. సీపీఎస్ రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్నే కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి : పీఆర్సీనీ వెంటనే ప్రకటించాలి : ఉద్యోగుల ఐక్యవేదిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.