ETV Bharat / state

మాకు చెప్పకుండా స్కూల్​ను ఎందుకు డెవలప్​ చేశారు: హెచ్​ఎంకు షోకాజ్​ నోటీసులు

author img

By

Published : Mar 24, 2023, 12:32 PM IST

Show Cause Notices
Show Cause Notices

Show Cause Notices to HM and MEO: మెదక్​ జిల్లా కేంద్రంలోని గర్ల్స్​ హైస్కూల్​ను ఓ స్వచ్ఛంద రూ.40 లక్షలు ఖర్చు చేసి రినోవేషన్ చేసింది. శిథిలావస్థకు చేరుకున్న బిల్డింగ్​ను.. అధునాతన హంగులతో అందంగా తీర్చిదిద్దింది. అయితే దీనిపై ఆ పాఠశాల హెచ్​ఎం, ఎంఈవోలు షోకాజ్​ నోటీసులు ఎదుర్కొన్నారు. ఈ విషయం ఇప్పుడు స్థానికంగా చర్చనీయంగా మారింది. మంచి పనులు చేస్తే షోకాజ్​ నోటీస్​ ఏంటి అనుకుంటున్నారా.. అయితే ఇది చదివేయండి.

హెచ్​ఎంకు షోకాజ్​ నోటీసులు

Show Cause Notices to HM and MEO: మెదక్ జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ గర్ల్స్ హైస్కూల్ హెడ్ మాస్టర్, మెదక్ మండల ఎంఈవోలకు డీఈవో షోకాజ్ నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశమైంది. మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ మల్కాజి​గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కుమారుడు డాక్టర్ మైనంపల్లి రోహిత్ గర్ల్స్ హైస్కూల్​ను దత్తత తీసుకున్నారు. దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ స్కూల్ బిల్డింగ్ అధ్వాన్నంగా తయారైంది. దీంతో స్టూడెంట్స్​, ఉపాధ్యాయు​లు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో స్కూల్​ను దత్తత తీసుకుని దాదాపు రూ.40 లక్షలకు పైగా ఖర్చు చేసి బిల్డింగ్​ను రినోవేశన్ చేయడంతో పాటు.. నూతనంగా టాయిలెట్స్​ను నిర్మించారు. మినరల్ వాటర్ ప్లాంట్, కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. ఇదే కాకుండా.. స్కూల్ చుట్టూ గ్రీనరీని డెవలప్ చేశారు. ఈ పనులతో స్కూల్ రూపు రేఖలు పూర్తిగా మారిపోయి కార్పొరేట్ స్కూల్​ను తలపిస్తోంది.

స్కూల్​లో మంచి పని చేస్తే.. షోకాజ్​ నోటీసులు: కాగా ముందస్తుగా తమ అనుమతి లేకుండా స్వచ్ఛంద సంస్థతో స్కూల్​లో పనులు ఎలా చేయించారంటూ గర్ల్స్ హైస్కూల్ ఇంఛార్జి హెడ్ మాస్టర్ రేఖతో పాటు, మండల విద్యాధికారి(ఎంఈవో) నీలకంఠంలకు డీఈవో రాధకిషన్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. స్కూల్ రినోవేశన్ పనులను ఇంతకు ముందు పని చేసిన డీఈవో రమేశ్​ కుమార్ కొబ్బరి కాయ కొట్టి ప్రారంభించడం గమనార్హం. ఈ మేరకు స్కూల్​లో మంచి పనులు చేయిస్తే అభినందించాల్సింది పోయి షోకాజ్ నోటీసులు ఇవ్వడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ఇదిలా ఉండగా.. రానున్న ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసే ఆలోచనతోనే మైనంపల్లి హనుమంతరావు తన కుమారుడు ఛైర్మెన్​గా ఉన్న ఎంఎస్​ఎస్​వో ఆధ్వర్యంలో నియోజకవర్గంలో సోషల్ సర్వీస్ ప్రారంభించారని పలువురు ఆరోపిస్తున్నారు. దీంతో వారికి పేరొస్తుందనే ఉద్దేశంతో అధికార బీఆర్​ఎస్ పార్టీకి చెందిన వారే ఆఫీసర్​లపై ఒత్తిడి తెచ్చి.. హెచ్​ఎం, ఎంఈవోలకు షోకాజ్ నోటీసులు ఇప్పించారనే ప్రచారం జరుగుతోంది.

పర్మిషన్ తీసుకోలేదని..: ఈ విషయమై డీఈవో రాధకిషన్​ను వివరణ కోరగా.. ప్రభుత్వ స్కూల్​లో స్వచ్ఛంద సంస్థలు ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకుంటే ముందస్తుగా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. అలా పర్మిషన్ తీసుకోకుండా పనులు చేయించినందుకు కలెక్టర్ ఆదేశాల మేరకు హెచ్​ఎం​, ఎంఈవోలకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.