ETV Bharat / state

Mandamarri Incident Updates : మేక చోరీ చేశారని యువకులను చిత్రహింసలు పెట్టిన ఘటన.. నలుగురి అరెస్ట్

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 3, 2023, 6:20 PM IST

Updated : Sep 3, 2023, 10:31 PM IST

Attacked on Stealing Goats in Mandamarri
Mandamarri Incident Updates

Mandamarri Incident Updates : మంచిర్యాల జిల్లా మందమర్రిలో మేకను దొంగతనం చేశారంటూ ఇద్దరిని వేలాడదీసి తీవ్రంగా దాడి చేసిన కేసులో పోలీసులు ఆదివారం నలుగురిని అరెస్ట్ చేశారు. మేకల యజమాని రాములు, అతడి భార్య స్వరూప, కుమారుడు శ్రీనివాస్, పని మనిషి నరేశ్​లపై 342, 367 సెక్షన్లతో పాటు అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

Mandamarri Incident Updates : మంచిర్యాల జిల్లా మందమర్రిలో మేకను దొంగతనం చేశారంటూ (Mandamarri Incident) పశువుల కాపరి తేజతో పాటు దళిత యువకుడు కిరణ్ వేలాడదీసి తీవ్రంగా కొట్టిన కేసులో.. పోలీసులు ఆదివారం నలుగురిని అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను బెల్లంపల్లి ఏసీపీ సదయ్య వెల్లడించారు. మందమర్రి పట్టణ శివారులోని పశువుల కొట్టం నుంచి 15 రోజులు క్రితం కిరణ్ అనే వ్యక్తి మేకను దొంగతనం చేశాడు. దీనిని గమనించి అడ్డుకోబోయిన పశువుల కాపరి తేజపై.. అతడు దాడికి యత్నించాడు. దీంతో తేజ మిన్నకుండిపోయాడు.

A Lover Attack on Young Woman With Knife : ఎల్బీనగర్ పరిధిలో దారుణం.. యువతిపై కత్తితో ప్రేమోన్మాది దాడి

Attacked on Stealing Goats in Mandamarri : ఈ క్రమంలోనే మూడు రోజుల క్రితం పశువుల కొట్టంలోని ఇనుప పైపును కూడా కిరణ్‌ ఎత్తుకెళ్లాడు. ఈ విషయాన్ని పశువుల కాపరి తేజ తన యజమాని దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో మేకల యజమాని రాములు, అతని భార్య స్వరూప, కుమారుడు శ్రీనివాస్, పని మనిషి అజ్మీర నరేశ్‌లు కిరణ్‌ను పిలిపించి అడగడంతో చోరీ చేసినట్టు ఒప్పుకున్నాడు. ఈ విషయం తెలిసి కూడా పశువుల కాపరి తేజ తమకు చెప్పలేదనే కోపంతో వారు.. ఇద్దరిని కొట్టానికి వేలాడదీసి.. కింద పొగ పెట్టి తీవ్రంగా కొట్టి వదిలేశారు.

Attack on Two People Viral Video in Mandamarri : రాత్రి అయినా కిరణ్ ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన బాధితుడి చిన్నమ్మ సరిత.. పోలీసులకు శనివారం ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో రాములు.. అతని భార్య స్వరూప, కుమారుడు శ్రీనివాస్, పని మనిషి నరేశ్‌పై 342, 367 సెక్షన్లతో పాటు అట్రాసిటీ కేసు నమోదు చేసి.. వారిని అరెస్ట్ చేసినట్లు ఏసీపీ తెలిపారు. అనంతరం నిందితులను రిమాండ్‌కు తరలించామన్నారు. మరోవైపు కనిపించకుండా పోయిన కిరణ్ ఆచూకీ కనుగొనేందుకు పోలీసు బృందాలతో గాలింపు చేపట్టామని ఏసీపీ సదయ్య వివరించారు.

"ఈ ఘటనలో నలుగురిని అరెస్ట్ చేశాం. రాములు, స్వరూప, శ్రీనివాస్‌, నరేశ్‌ను అరెస్టు చేశాం. కనిపించకుండా పోయిన కిరణ్‌ కోసం గాలిస్తున్నాం." - సదయ్య, బెల్లంపల్లి ఏసీపీ

అసలేం జరిగిందంటే..: శనివారం మందమర్రిలో మేకను దొంగతనం చేశారనే నెపంతో.. మానవత్వం, కనికరం లేకుండా ఓ దళిత యువకుడు, పశువుల కాపరిని తలకిందులుగా వేలాడ దీసి దాడి చేశారు. మందమర్రి అంగడి బజార్‌ ప్రాంతంలో ఉండే కొమురాజుల రాములు, అతని భార్య స్వరూప, కుమారుడు శ్రీనివాస్.. శివారులోని గంగ నీళ్ల పంపుల సమీపంలో మేకల షెడ్డులో మేకలు పెంచుతున్నారు. మేకల మంద నుంచి 15 రోజుల క్రితం ఒక మేక కనిపించకుండా పోయింది.

దళిత బాలుడిపై దారుణం.. గణేశుడి​ విగ్రహాన్ని తాకాడని మూకదాడి

దీంతో పశువుల కాపరి తేజ, అతడి స్నేహితుడైన దళిత యువకుడు చిలుముల కిరణ్​లు మేకను ఎత్తుకెళ్లారని అనుమానించిన రాములు కుటుంబం.. ఇద్దరిని షెడ్డు వద్దకు పిలిపించారు. ఈ క్రమంలోనే వారిని కొట్టానికి వేలాడదీసి.. కింద పొగ పెట్టి తీవ్రంగా కొట్టి (Two People Beaten Suspicion of Stealing Goat) వదిలేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. తాజాగా నలుగురిని అరెస్ట్ చేశారు.

Woman Beaten Up : మహిళ జుట్టును కత్తిరించి.. నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లి.. ఆ అనుమానంతోనే..

A Lover Attacked With Knife Young Woman : జగద్గిరిగుట్టలో యువతిపై కత్తితో ప్రేమోన్మాది దాడి

Last Updated :Sep 3, 2023, 10:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.