ETV Bharat / state

మందమర్రిలో అక్రమ పింఛన్ల బాగోతం

author img

By

Published : Aug 4, 2020, 4:16 PM IST

Updated : Aug 12, 2020, 6:41 AM IST

మంచిర్యాల జిల్లా మందమర్రి పురపాలికలో పింఛన్ల బాగోతం వెలుగు చూసింది. పింఛను మొత్తాన్ని రెండు వేలకు పెంచడంతో అక్రమార్కుల కన్ను పడింది. దీంతో ప్రభుత్వ నిబంధనలను కొందరు అధికారులు దళారులు తుంగలో పెట్టి కొన్నేళ్లుగా అక్రమంగా పింఛన్ పొందుతూ వచ్చారు.

Illegal pensions in Mandamarri, manchiryala district
మందమర్రిలో అక్రమ పింఛన్ల బాగోతం

వివరాలు ఇలా..

మున్సిపాలిటీలో 53 వేల మంది జనాభా 13 వేల కుటుంబాలు ఉన్నాయి అందులో 6069 మంది వృద్ధాప్య ,వితంతు , దివ్యాంగులు, ఒంటరి మహిళ, గీత కార్మికులు చేనేత కార్మికులు పెన్షన్ పొందుతున్నారు.

Illegal pensions in Mandamarri
అక్రమ పింఛన్ల బాగోతం

అక్రమాలు ఇలా...

పట్టణములో 526 మంది అనర్హులు పింఛన్ పొందుతున్నారని అధికారుల దృష్టికి వెళ్ళింది. విచారణ చేపట్టిన అనంతరం 263 మంది ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వీటిని తీసుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు.

సింగరేణి పెంచడంతో పాటు ప్రభుత్వ పింఛన్ పొందుతున్న వారు కొందరైతే, మరణించిన కూడా పేరు తొలగించకుండా పెన్షన్ పొందుతున్న వారు ఇంకొందరు ఉన్నారు. ఒకే ఇంట్లో భార్యాభర్తలు పింఛన్ పొందుతున్న వారు చాలా మంది ఉన్నట్లు గుర్తించి అవాక్కయ్యారు. గతంలో పనిచేసిన కొందరు పురపాలిక అధికారుల ప్రోత్సాహంతోనే అవినీతి దందా కొనసాగించినట్లు తెలుస్తుంది. ఇలా 2016 సంవత్సరం నుంచి ఈ స్వాహా పర్వం కొనసాగింది. దీంతో లక్షల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై పురపాలక కమిషనర్ రాజుని వివరణ కోరగా అక్రమ పింఛన్లు ఉన్నమాట వాస్తవమేనని.. విచారణ చేస్తున్నట్లు తెలిపారు.

ఇవీ చూడండి: గ్రేటర్‌లో కాస్త ఊరట... తాజాగా 273 మందికి వైరస్

Last Updated : Aug 12, 2020, 6:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.