ETV Bharat / state

కరోనా సోకిన కుటుంబానికి భాజపా జిల్లా అధ్యక్షుడు సాయం

author img

By

Published : Aug 14, 2020, 1:29 PM IST

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం ఇటిక్యాల గ్రామంలో కుటుంబానికి భాజపా మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథరావు సాయం చేశారు. హోం ఐసోలేషన్​ కిట్స్, ఆక్సీమీటర్​, థర్మమీటర్​, కరోనా నివారణ టాబ్లెట్లు, మాస్కులను ఆయన అందజేశారు.

BJP district president helps corona infected family
కరోనా సోకిన కుటుంబానికి భాజపా జిల్లా అధ్యక్షుడు సాయం

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం ఇటిక్యాల గ్రామంలో ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. వారు తమ ఇంటిలోనే ఉంటున్నారు. కరోనా బాధితుల కోసం ఏర్పాటు చేసిన హెల్ప్​లైన్​ సెంటర్​కు ఫోన్​ చేయడంతో భాజపా మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథరావు.. అక్కడికి చేరుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. హోం ఐసోలేషన్​ కిట్స్, ఆక్సీమీటర్​, థర్మమీటర్​, కరోనా నివారణ టాబ్లెట్లు, మాస్కులను ఆయన అందజేశారు. ఆ కుటుంబానికి తగు జాగ్రత్తలు తెలిపారు. జిల్లాలో ఎవరైనా కరోనా పాజిటివ్​ పేషెంట్లు ఉన్నట్లయితే తాము ఏర్పాటు చేసిన 96767 33230 హెల్ప్​లైన్​ నంబర్​కు ఫోన్​ చేయాలని సూచించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.