ETV Bharat / state

కేసీఆర్​పై వాట్సాప్​లో అసత్య ప్రచారం.. ఐదుగురు అరెస్ట్

author img

By

Published : Oct 25, 2019, 9:38 PM IST

కేసీఆర్​పై వాట్సాప్​లో అసత్య ప్రచారం

సీఎం కేసీఆర్​, మంత్రి కేటీఆర్​లపై అసత్య ప్రచారం చేసిన ఆరుగురిపై బెల్లంపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఏసీపీ బాలు జాదవ్​ హెచ్చరించారు.


ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్​లను కించపరుస్తూ వాట్సాప్ గ్రూపుల్లో అసభ్య సందేశాలు పంపిన ఆరుగురిపై మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఏసీపీ బాలు జాదవ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. బెల్లంపల్లి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్​లో గ్రూప్​ అడ్మిన్​ తోడే వెంకట కృష్ణారెడ్డితో పాటు అసత్య సందేశం పంపిన బండారి మల్లేశ్​లపై కేసు నమోదు చేసినట్లు ఏసీపీ తెలిపారు. తాళ్లగురజాలలో యంగ్​ స్టార్​ గ్రూప్​ అడ్మిన్లు యాదండ్ల బాలు యాదవ్​, వెంకటేశ్​లతో పాటు సందేశాలు పంపిన జూపాక రాజేశ్​, బొంతల లక్ష్మి నారాయణలపై పలు కేసులు నమోదు చేశారు. నిందితుల్లో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఒక గ్రూప్​ అడ్మిన్​ అమెరికాలో ఉన్నట్లు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో కించపరిచేలా సందేశాలు పంపితే కఠిన చర్యలు తప్పవని ఏసీపీ బాలు జాదవ్​ హెచ్చరించారు.

కేసీఆర్​పై వాట్సాప్​లో అసత్య ప్రచారం

ఇవీచూడండి: తెరాస గెలిచినంత మాత్రాన పండుగ కాదు: కిషన్​రెడ్డి

Intro:కేసీఆర్, కేటీఆర్ లపై అసత్య ప్రచారం
....అరుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు

ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లను కించపరుస్తూ వాట్సాప్ గ్రూపుల్లో అసభ్య
సందేశాలు పంపిన ఆరుగురు వ్యక్తులపై మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఏసీపీ బాలు జాదవ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. బెల్లంపల్లి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఇద్దరిపై, తాళ్ళగురజాల పొలీస్ స్టేషన్ లో నలుగురిపై పొలిసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో బెల్లంపల్లి నియోజకవర్గం గ్రూప్ అడ్మిన్ తోడే వెంకట కృష్ణా రెడ్డితో పాటు బండారి మల్లేష్ ల పై కేసు నమోదైంది. తాళ్ళగురజాల పోలీస్ స్టేషన్ పరిధిలో యంగ్ స్టార్ గ్రూప్ అడ్మిన్లు యాదండ్ల బాలుజాదవ్, వెంకటేశ్ ల తో పాటు సందేశాలు పంపిన జూపాక రాజేష్, బొంతల లక్మి నారాయణ ల పై కేసు నమోదు చేశారు. ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో కించపరిచేలా పోస్టులు చేస్తే చర్యలు తప్పవని ఏసీపీ బాలు జాదవ్ హెచ్చరించారు. Body:బైట్
బాలు జాదవ్, ఏసీపీ, బెల్లంపల్లిConclusion:బెల్లంపల్లి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.