ETV Bharat / state

'వాళ్లు పైసలు ఇచ్చి మంత్రి పదవులు కొనుక్కొని.. తర్వాత దందాలు చేస్తారు'

author img

By

Published : May 6, 2022, 3:28 PM IST

Updated : May 6, 2022, 4:24 PM IST

bandi sanjay
bandi sanjay

Bandi Sanjay on TRS: ఆర్నెళ్లలో రాబోయేది భాజపా సర్కారేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ధీమా వ్యక్తం చేశారు. సమాజంలో అన్నివర్గాల సంక్షేమాన్ని విస్మరించిన తెరాస ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని అన్నారు. మహబూబ్‌నగర్‌లో పాదయాత్రను కొనసాగిస్తున్న బండి సంజయ్‌ ముదిరాజ్‌లతో ప్రత్యేకంగా ముఖాముఖి జరిపారు. రాష్ట్రంలో తెరాస పాలన ఇక గతమేనని బండి జోస్యం చెప్పారు.

Bandi Sanjay on TRS: ముదిరాజుల సమస్యల్ని పరిష్కరించడానికి భాజపా కట్టుబడి ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బండి సంజయ్ 23వ రోజు పాలమూరు పట్టణంలో పాదయాత్ర చేశారు. అంబా భవాని ఆలయం వద్ద ముదిరాజ్​లతో ‘ముఖాముఖి’ నిర్వహించారు. తెరాస, కాంగ్రెస్ పార్టీల్లాగా భాజపా భయపడదన్నారు. దేశం కోసం, ధర్మం కోసం, పేదల కోసం చావడానికైనా తాను సిద్ధమేనని స్పష్టం చేశారు.

ముదిరాజులతో పాటు పద్మశాలీలు, యాదవులు సహా హిందువుల్లో ఐక్యత రావాలని, అందుకోసమే తాను కృషి చేస్తున్నానని బండి సంజయ్​ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముదిరాజుల్లో ఒకరిద్దరికి ఆశచూపి గొడవ పెట్టిస్తారని అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం కొనసాగేది 6 నెలలు మాత్రమేనని.. ఎప్పుడూ ఎన్నికలొచ్చినా భాజపా అధికారంలోకి వస్తుందని ధీమా చెప్పారు. అందుకోసం అంతా కలిసి పనిచేయాలని సూచించారు. కేసీఆర్ కుటుంబం, మంత్రులు, ఎమ్మెల్యేలంతా అవినీతిలో కూరుకుపోయారని, 2వేల కోట్లతో నిర్మించిన ఆలయం యాదగిరిగుట్ట, ఒక్క వానతో నిర్మాణంలోని డొల్లతనం బయటపడిందన్నారు.

యాదగిరిగుట్టలో పార్కింగ్ ఛార్జీల మీద కూడా దందా నడుస్తోందని... కార్ పార్కింగ్ చేస్తే 500 వసూలు చేస్తున్నారని, గంటకు అదనంగా 100 వసూలు చేస్తున్నారని బండి సంజయ్​ విమర్శించారు. ఆలయాల్లో పనిచేసే అయ్యగార్లకు జీతాలు ఇవ్వరు కానీ, మౌజమ్​లకు, ఇమామ్​లకు, ఫాస్టర్స్​కు జీతాలు ఇస్తారని ఎద్దేవా చేశారు. మన దేవతలకు దేవుళ్లకు అవమానం జరిగినా... స్పందించని కేసీయార్... ఓవైసీని పట్టుకుని, కౌగిలించుకుని, సెంట్ పూసుకుంటున్నారని ఆరోపించారు. బాంఛన్ బతుకులొద్దని, గల్లాపట్టి నిలదీయాలని పిలుపునిచ్చారు.

'చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వంలోకి వెళ్తారు. అమ్ముడు పోతారు. భాజపా కూడా అంతే అనుకుంటున్నారు. పేదలను, సామాన్యులను ఇబ్బంది పెట్టే వాళ్లను భాజపా ఎప్పుడూ తీసుకోదు. పైసలు ఇచ్చి మంత్రి పదవులు కొనుక్కొని... ఇసుక, మట్టి, అన్ని దందాలు చేస్తారు. మీకు న్యాయం జరగాలంటే తెరాస ప్రభుత్వం పోవాలి.' - బండి సంజయ్​, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

'వాళ్లు పైసలు ఇచ్చి మంత్రి పదవులు కొనుక్కొని.. తర్వాత దందాలు చేస్తారు'

ఇదీ చదవండి : అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: బండి సంజయ్

ఆ జిల్లాలో మంకీ ఫీవర్ కలకలం.. ఆసుపత్రులకు జనం పరుగులు!​

Last Updated :May 6, 2022, 4:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.