ETV Bharat / state

'చంద్రబాబును ధైర్యంగా ఎదుర్కోలేక ఆయనపై కేసు'

author img

By

Published : Mar 17, 2021, 8:33 PM IST

చంద్రబాబును ధైర్యంగా ఎదుర్కోలేక ఆయనపై కేసు నమోదు చేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి కొత్తకోట దయాకర్ రెడ్డి ఆరోపించారు. ప్రజల దృష్టి మరల్చేందుకే కావాలని చేశారని మండిపడ్డారు. ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదన్నారు.

చంద్రబాబును ఎదుర్కోలేక కేసు పెట్టారన్న కొత్తకోట దయాకర్ రెడ్డి
చంద్రబాబును ఎదుర్కోలేక కేసు పెట్టారన్న కొత్తకోట దయాకర్ రెడ్డి

తెదేపా అధినేత చంద్రబాబు నాయుడును ధైర్యంగా ఎదుర్కోలేక ఆయనపై కేసు నమోదు చేశారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కొత్తకోట దయాకర్ రెడ్డి మండిపడ్డారు. మే 6న ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిని విశాఖపట్నంకు తరలించే క్రమంలో ప్రజల దృష్టి మరల్చేందుకే కావాలని చేశారని ఆరోపించారు.

చట్టం ద్వారానే..

మహబూబ్​నగర్ జిల్లా కేంద్రంలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. మంచి రాజధానిని నిర్మించాలనే ల్యాండ్ పూలింగ్ చట్టం ద్వారానే నిబంధనల మేరకు పరిహారం చెల్లించి భూములు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. బాబును దైర్యంగా ఎదుర్కొలేక ఏడేళ్ల తర్వాత సీబీసీఐడీ నోటీసులు పంపడం విడ్డూరమని విమర్శించారు.

భయపడేది లేదు..

భూములకు సంబంధించి పోలీస్ స్టేషన్​లో ఎవరూ నేరుగా పిర్యాదు చేయలేదని పేర్కొన్నారు. కేసు నమోదు కాకుండానే నోటీసులు జారీ చేశారనీ మండిపడ్డారు. ఇలాంటి బెదిరింపులకు బాబు, ఆయన కుటుంబం, కార్యకర్తలు భయపడేది లేదన్నారు.

ఇదీ చూడండి: సాగర్‌ ఉపఎన్నికలో గెలుపు మాదే: బండి సంజయ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.