ETV Bharat / state

వేణుమాధవ్​ ఇకలేడంటే నమ్మలేకపోతున్నా: గౌతంరాజు

author img

By

Published : Sep 25, 2019, 7:05 PM IST

హాస్యనటుడు వేణుమాధవ్​ మరణం తీరని లోటని నటుడు, మా అసోసియేషన్​ సంయుక్త కార్యదర్శి గౌతంరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో వేణు మాధవ్​ ముందుండే వాడన్నారు.

వేణుమాధవ్​ ఇకలేడంటే నమ్మలేకపోతున్నా: గౌతంరాజు

వేణుమాధవ్​ మృతి సినీ పరిశ్రమకు తీరనిలోటని ప్రముఖ సినీ హాస్యనటుడు గౌతంరాజు అన్నారు. నటుడిగా ఎందరో పేదలకు సాయం చేసిన వ్యక్తి మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు.

గౌతంరాజు కుమారుడు కృష్ణంరాజు హీరోగా నటించిన 'కృష్ణారావు సూపర్‌ మార్కెట్‌' సినిమా ప్రచారాన్ని మహబూబ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్​ కళాశాలలో నిర్వహించారు. తన కుమారుడు ఈ కళాశాల పూర్వ విద్యార్థి కావడం వల్లనే ప్రచార కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే విడుదల చేయడమే చాలా కష్టమని గౌతంరాజు తెలిపారు. అక్టోబర్​ 18న చిత్రం విడుదల కానుందన్నారు.

వేణుమాధవ్​ ఇకలేడంటే నమ్మలేకపోతున్నా: గౌతంరాజు

ఇవీ చూడండి: వేణుమాధవ్ మృతి పట్ల ప్రముఖుల సంతాపం

Intro:TG_Mbnr_14_25_Cinema_Pramotion_AVB_TS10052
కంట్రిబ్యూటర్‌: చంధ్రశేఖర్‌-మహబూబ్‌నగర్‌ (9390592166)
( ) ప్రముఖ సినీ హస్యనటుడు గౌతంరాజు కుమారుడు కృష్ణంరాజు హీరోగా నటించిన 'కృష్ణారావు సూపర్‌ మార్కెట్‌'' సినిమా ప్రమోషన్‌ను మహబూబ్‌నగర్‌లో నిర్వహించారు. Body:ఈ రోజుల్లో సినిమా తియడం ఒకింత కష్టమైతే.. దాన్ని రిలీజ్‌ చేయడం మరింత కష్టతరమైందని సినీ హస్యనటుడు గౌతంరాజు అన్నారు.
ఓ స్థాయిలో ఉన్నవారికే అది సాధ్యమవుతుందని.. కానీ.. తన లాంటి మాములు ఆర్టిస్ట్‌లకు సాధ్యంకాని పరిస్థితి ఉందన్నారు.
అక్టోబర్‌ 18న విడుదల కానున్న తన కుమారుని 'కృష్ణారావు సూపర్‌ మార్కెట్‌' సినిమా ప్రమోషన్‌ను మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని జయప్రకాశ్‌ నారాయణ ఇంజనీరింగ్‌ కళాశాలలో నిర్వహించారు. హీరో కళాశాల పూర్వ విద్యార్థి కావడంతో ప్రమోషన్‌ కార్యక్రమంను ఇక్కడ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. Conclusion:హస్యనటుడు వేణు మాదవ్‌ మృతి సినీ ఇండస్ట్రీకి తీరని లోటని.. ఒక ఆర్టీస్ట్‌గా కాకుండా పేదలకు ఏ ఆపద వచ్చిన సహాయం చేసే వ్యక్తి అని గుర్తు చేసుకున్నారు. ఆయన మృతి తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని.. మూవి ఆర్ట్స్‌ అసోసియేషన్‌ తరపును సంతాపం తెలిపారు......byte
బైట్‌
గౌతంరాజ్‌, సంయుక్త కార్యదర్శి, మా అసోసియేషన్‌
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.