ETV Bharat / state

Turmeric price: గిట్టుబాటు ధర రాక.. అమ్మలేక.. ఆరేళ్లుగా ఆరైతు?

author img

By

Published : Apr 21, 2023, 7:16 PM IST

Updated : Apr 21, 2023, 7:32 PM IST

Turmeric price: ఓరైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో తన ఇంట్లోనే గత 6 సంవత్సరాలుగా నిల్వ ఉంచుతున్నాడు. గిట్టుబాటు ధర వస్తే గాని దానిని విక్రయించని అంటున్నాడు. ఈ క్రమంలోనే పంట నిల్వ కోసం నెలకు రూ. 3000 ఖర్చు చేస్తున్నాడు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

warangal
warangal

Turmeric price: రైతులు మద్దతు ధర రాకపోతే కాస్త అటుఇటు అయినా చేతికి వచ్చిన పంటని అమ్మేస్తారు. లాభం రాకున్న పెట్టబడులు వస్తే చాలని అనుకుంటారు . కానీ ఓ అన్నదాత సంవత్సరాలుగా పండించిన పసుపుకు గిట్టుబాటు ధర రావడం ఇంట్లోనే నిల్వ ఉంచుతున్నాడు.
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కేసముద్రం గ్రామానికి చెందిన రైతు కాటం రాంరెడ్డి. తాను పండించిన పసుపు పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో గత 6 ఏళ్లుగా సుమారు 120 క్వింటాల పసుపును నిల్వ చేస్తున్నారు.

మంచి ధర వస్తేగానీ అమ్మను: ఇందుకోసం పంటను ఒక గదిలో నిల్వ ఉంచి గదిలోకి గాలి వెళ్లకుండా తలుపులను పూర్తిగా వార్తాపత్రికలతో కప్పేశాడు. పసుపు ధర ఎప్పుడైతే క్వింటాకు రూ.10,000 నుంచి రూ.15,000 వరకు చేరితే అప్పుడే అమ్మేందుకు ఎదురు చూస్తున్నాడు. కానీ ధర కాస్తా రూ.5,000 నుంచి రూ.8,000 మధ్యనే పలుకుతోంది. ఈ ధరకు పసుపును విక్రయిస్తే పెట్టిన పెట్టుబడి కూడా రాదని రాంరెడ్డి వాపోతున్నాడు. ఇంకా నిల్వ చేసిన పసుపుకు పురుగు పట్టకుండా ఉండేందుకు రసాయన బిల్లలను పసుపు బస్తాల మధ్య వేస్తున్నట్టు అందుకోసం దాదాపు నెలకు రూ. 3000 ఖర్చు చేస్తున్నట్టు తెలిపాడు.

గిట్టుబాటు ధర రాక 15 టన్నుల పసుపును నిల్వ: మహబూబబాద్ మండలం సింగారం గ్రామానికి చెందిన రైతు శ్రీనివాస్​ రెడ్డి గత 5 సంవత్సరాలుగా గిట్టుబాటు ధర రావడం లేదని 15 టన్నుల పసుపును నిల్వ ఉంచుతున్నారు. ఇలా చాలా మంది రైతులు పసుపుకు అధిక గిట్టుబాటు ధర వస్తుందనే ఆశతో జిల్లాలోని రైతుశీల గిడ్డంగులలో పసుపును భద్రపరిచారు. ప్రభుత్వం పసుపుకు మద్దతు ధర ప్రకటించాలని, క్వింట పసుపుకు రూ.12,000 ధర ఉండేలా చేసి పసుపు రైతులని ఆదుకోవాలని కోరారు.

పసుపును 6 సంవత్సరాలుగా నిల్వ చేస్తున్నాను. గిట్టుబాటు ధర వస్తుందనుకున్న కానీ రావడం లేదు. రైతులకు ప్రభుత్వం మద్దతు ధర ఇస్తానని చెప్పి ఇవ్వలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం మద్దతు ధర కల్పించి మమల్ని ఆదుకోవాలని కోరుతున్నాం. - కాటం రాంరెడ్డి, రైతు

ఇవీ చదవండి:

Last Updated : Apr 21, 2023, 7:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.