ETV Bharat / state

ముగిసిన సాదాబైనామాల గడువు...పొడిగించాలంటూ ప్రజల విజ్ఞప్తి

author img

By

Published : Nov 10, 2020, 9:46 PM IST

రాష్ట్రవ్యాప్తంగా సాదాబైనామాల క్రమబద్ధీకరణ దరఖాస్తు గడువు నేటితో ముగిసింది. చివరి రోజు కావడంతో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా మీసేవలకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. సర్వర్ మొరాయించడంతో చాలామంది వెనుదిరిగారు. మరోసారి గడువు పెంచాలంటూ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

sadhabinama registration date ended today people demand to extend date once again
ముగిసిన సాదాబైనామాల గడువు...పొడిగించాలంటూ ప్రజల విజ్ఞప్తి

సాదాబైనామాల క్రమబద్ధీకరణకు దరఖాస్తు గడువు నేటితో ముగియడంతో ప్రజలు నిరాశతో వెనుదిరిగారు. మహబూబాబాద్ జిల్లావ్యాప్తంగా ఉదయం నుంచే మీసేవల వద్ద ప్రజలు పెద్దఎత్తున బారులు తీరారు. సర్వర్ మొరాయించడంతో చాలామంది దరఖాస్తు చేయకుండానే వెనుదిరగాల్సి వచ్చింది.

వారం రోజులుగా మీసేవల చుట్టూ తిరుగుతున్న రద్దీగా ఉండడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచి క్యూలైన్లలో వేచి ఉన్నా దరఖాస్తు చేసుకోలేదని వాపోయారు. దయచేసి ప్రభుత్వం మరోసారి గడువు పొడిగించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చూడండి:'రేపటి నుంచి ఆన్ లైన్ లో రిజిస్టర్ చేసుకోవచ్చు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.