ETV Bharat / state

Mahabubabad: ఆటో డ్రైవర్‌ సమయస్ఫూర్తితో నిలిచిన ప్రాణాలు

author img

By

Published : Dec 20, 2022, 11:53 AM IST

Auto driver saves man life: మానవ జన్మ దేవుడిచ్చిన వరం. కొందరు చిన్న చిన్న సమస్యల వల్లో లేదా వివిధ కారణాలవల్ల ఆత్మహత్య చేసుకుంటారు. డోర్నకల్​లో అలా ఆత్మహత్యయత్నానికి పాల్పడిన యువకుడిని ఆటో డ్రైవర్ రక్షించాడు. క్షణికావేశంలో ఊపిరి తీసుకోవాలనుకున్న ఆ యువకుడికి ప్రాణం విలువేంటో చెప్పాడు.

ఆటో డ్రైవర్ సమయస్ఫూర్తి
ఆటో డ్రైవర్ సమయస్ఫూర్తి

Auto driver saves man life: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ యువకుడిని ఆటో చోదకుడు సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రాణాలు కాపాడారు. డోర్నకల్‌లోని లింగాల అడ్డా మీదుగా వెళుతున్న ఆటోని ఆపి ఎక్కిన వ్యక్తి గోవింద్రాల స్టేజీ వరకు వెళ్లాలని చెప్పి కూర్చున్నారు. ఈలోగా ఆ ప్రయాణికుడు తన సోదరికి ఫోన్‌ చేసి పురుగుల మందు తాగానని.. ఆటోలో ఇంటికి వస్తున్నట్లు చెప్పి వెనకాల సీటులో పడిపోయారు. ఆయన మాటలు విన్న ఆటో డ్రైవర్‌ శివ ఆలస్యం చేయకుండా వాహనాన్ని డోర్నకల్‌ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అపస్మారస్థితికి చేరిన వ్యక్తి వద్ద ఉన్న చరవాణి తీసుకుని ఆయన ఆటోలో మాట్లాడిన వ్యక్తి నెంబరుకు కాల్‌ చేశారు. ఇంతకు ముందు మీతో మాట్లాడిన వ్యక్తిని ఆసుపత్రిలో చేర్చినట్లు తెలిపారు. ఈలోగా బాధితుడికి పీహెచ్‌సీ సిబ్బంది ప్రథమ చికిత్స చేశారు.

ఆటోడ్రైవర్‌ ఇచ్చిన సమాచారంతో బంధువులను తీసుకుని ఆసుపత్రికి చేరుకున్న తల్లి సుశీల కొడుకుని చూసి కన్నీరు మున్నీరయ్యారు. స్పృహ తప్పిన ఆమెకు అక్కడే చికిత్స అందించారు. బాధిత వ్యక్తి స్వస్థలం ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం గోవింద్రాల గ్రామానికి చెందిన పేరు భూక్య లాలు (19)గా బాధితుడి బంధువులు తెలిపారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు ఏమిటనేది తమకు తెలియదన్నారు. బాధితుడిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చామని 108 ఈఎంటీ శ్రీనివాస్‌, పైలట్‌ సైదులు తెలిపారు. పురుగుల మందు తాగిన వ్యక్తిని సమయస్ఫూర్తితో పీహెచ్‌సీకి తీసుకొచ్చిన ఆటో డ్రైవర్‌ శివను ప్రతి ఒక్కరూ ప్రశంసించారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.