ETV Bharat / state

మైనర్​ బాలికపై అత్యాచారం.. గర్భం దాల్చడంతో వెలుగులోకి

author img

By

Published : Feb 15, 2023, 5:40 PM IST

A minor girl was raped in Mahabubabad: కొందరు వ్యక్తులు ఎప్పటికి ఎలా ప్రవర్తిస్తారో తెలియదు. కామం మత్తులో పడి ఎలా ప్రవర్తిస్తున్నారో కూడా ఎవరికి అర్థం అవ్వడం లేదు. మహబూబాబాద్​ జిల్లాలో ఇద్దరు వ్యక్తులు మైనర్ బాలికపై అత్యాచారం చేశారు.

A minor girl was raped in Mahabubabad
మహబూబాబాద్ జిల్లాలో మైనర్​ బాలికపై అత్యాచారం

A minor girl was raped in Mahabubabad: కొంత మంది వ్యక్తులు తాము ఏమి చేసిన ఎవరు అడగరులే అనుకొని వారికి నచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. చివరికి ఏదో రోజు వారు చేసిన పనుల వలనే నిందితులుగా ప్రజలు ముందు నిలుస్తున్నారు. ప్రభుత్వం, పోలీసులు.. బాలికల పట్ల, మహిళలతో గౌరవంగా ఉండాలని ఎంత చెప్పిన వారు పాటించకపోగా చేయరాని తప్పులను చేస్తున్నారు. మహిళలపై అత్యాచారం విషయంలో ఎన్ని చట్టాలు తీసుకు వచ్చినా కామాంధుల్లో మార్పు రావడం లేదు. రోజురోజు నమోదవుతున్న కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి.

తాజాగా మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని ఓ తండాలో అభం.. శుభం తెలియని మైనర్ బాలికపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ బాలిక గర్భం దాల్చడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, బాధితురాలి కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు మండలానికి చెందిన ఓ తండాలో 14 సంవత్సరాల బాలికపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారు.

తండాలో ఇంట్లో ఒంటరిగా ఉన్న మైనర్ బాలికపై ఓ పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు గత 4 నెలల క్రితం అత్యాచారం చేశారు. బాలిక గర్భం దాల్చడంతో విషయం బయటకు వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలిని విచారించిన పోలీసులు కేసు నమోదు చేశారు.

అత్యాచారం చేసిన ఇద్దరు వ్యక్తులపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్​ఐ సతీష్ వెల్లడించారు. నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడని అతడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.