Fraud In KPHB: హైదరాబాద్‌లో ఘరానా మోసాలు రోజుకోకటి వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కేపీహెచ్‌బీలోని ఎక్స్‌సీఎస్‌పీఎల్ అనే సంస్ధ పెట్టుబడుల పేరుతో మోసం చేసిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మోసపోయామని ఆలస్యంగా గ్రహించిన బాధితులు ఆ సంస్థ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ఎక్స్‌సీఎస్‌పీఎల్ కంపెనీలో రూ.లక్ష కడితే ఏడాదికి రూ.4 లక్షలు వస్తాయని తమ వద్ద పెట్టుబడులు పెట్టించుకొని ఇప్పుడు కంపెనీ బోర్డు తిప్పేసిందని బాధితులు లబోదిబోమంటూ ఆందోళన చెందుతున్నారు.
అధిక లాభాలు వస్తాయని కంపెనీ చెప్పడంతో అప్పులు తెచ్చి మరీ సంస్థలో పెట్టుబడి పెట్టామని.. డబ్బు తిరిగి ఇవ్వడం లేదని బాధితుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న కేపీహెచ్‌పీ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇంత వరకు ఎంత మంది పెట్టుబడులు పెట్టారు. ఎంత మొత్తంలో పెట్టుబడి పెట్టారు అనే దానిపై ఇంకా పూర్తి సమాచారం రావాల్సి ఉంది.
ఇటీవలే కాలంలో హైదరాబాద్‌లో ఇలాంటి ఘటనలు అనేకం చోటుచేసుకుంటున్నాయి. నిందితులు అమాయకపు జనాలను గుర్తించి సైబర్, క్రిప్టో కరెన్సీ, అధిక వడ్డీలు ఇలా చాలా రకాలుగా మోసాలకు పాల్పడుతున్నారు. గత నెలలో సినీనటులు, క్రికెటర్లతో ప్రకటనల్లో నటించే అవకాశం కల్పిస్తామంటూ భారీగా డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరు నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు.
వీరి నుంచి దాదాపు రూ.15లక్షల60వేలు, నాలుగు స్మార్ట్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలోని పుణెకు చెందిన అపూర్వ అశ్విన్ దావా.. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో మాస్టర్స్ పూర్తి చేశాడు. దర్శకత్వం, నటనపై ఇష్టంతో 20 ఏళ్ల పాటు మోడలింగ్‌లో కొనసాగాడు. ప్రముఖనటులు, క్రికెటర్ల ప్రకటనల్లో నటించే అవకాశాలిప్పిస్తామంటూ భారీగా డబ్బు వసూలు చేస్తున్న దంపతుల్ని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.
ఇవీ చదవండి:
Cyber Crime: రూ.500లకే కంచిపట్టు చీర.. అయితే జాగ్రత్త పడాల్సిందే..?
పోయిన చోటే రాబట్టుకోవాలని.. రూ.87లక్షలు కోల్పోయాడు.!
ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి దిల్లీ ముఠా మోసాలు.. అరెస్ట్ చేసిన పోలీసులు