ETV Bharat / state

ప్రారంభమైన శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి జాతర

author img

By

Published : Feb 26, 2021, 7:12 PM IST

కొమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా గంగాపూర్​ గ్రామంలో మూడు రోజుల పాటు జరగనున్న శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి జాతర నేడు ప్రారంభమైంది. ఈ వేడుకకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారన్న అంచనాలతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు భద్రతా చర్యలు చేపట్టారు.

Venkateswara Swamy Jatara started in the komaram bheem asifabad district
ప్రారంభమైన శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి జాతర

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గంగాపూర్​ గ్రామంలో శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి జాతర ఘనంగా ప్రారంభమైంది. ఈ నెల 28 వరకు జరగనున్న ఈ వేడుకకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.

శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామివారికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అధికారులు పట్టు వస్త్రాలను సమర్పించారు. స్వామివారి ఉత్సవ విగ్రహాలతో శనివారం సాయంత్రం 6:30 గంటలకు రథోత్సవ కార్యక్రమం జరగనుందని ఆలయ పూజారులు తెలిపారు. ఈ జాతరకు ఇతర రాష్టాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో హాజరవుతారన్న అంచనాలతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టినట్లు ఆసిఫాబాద్​ డీఎస్పీ అచ్చెశ్వరరావు తెలిపారు.

ఇదీ చదవండి: మేడారానికి పోటెత్తిన భక్తులు.. మొక్కులు చెల్లింపులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.