ETV Bharat / state

ఇదే స్పూర్తితో లాక్​డౌన్​ను కొనసాగించాలి: జడ్పీ ఛైర్​పర్సన్

author img

By

Published : Mar 31, 2020, 10:08 AM IST

ఇదే స్పూర్తితో లాక్​డౌన్​ను కొనసాగించాలని ఆసిఫాబాద్ జడ్పీ ఛైర్​పర్సన్​ కోవా లక్ష్మీ కోరారు. ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి జిల్లా కేంద్రంలో మార్కెట్​ను పరిశీలించారు. ప్రజలకు మాస్కులు, మంచినీటి బాటిళ్లు పంపిణీ చేశారు.

masks and water bottles distribution in market
ఇదే స్పూర్తితో లాక్​డౌన్​ను కొనసాగించాలి: జడ్పీ ఛైర్​పర్సన్

ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్​ను జడ్పీ ఛైర్​పర్సన్​ కోవా లక్ష్మీ, ఎమ్మెల్యే ఆత్రం సక్కు పరిశీలించారు. వైరస్​ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు పలు సూచనలు చేశారు. మాస్కులు, మంచినీటి బాటిళ్లు పంపిణీ చేశారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టిందన్నారు.

ఇదే స్ఫూర్తితో లాక్​డౌన్​ను కొనసాగించాలని జడ్పీ ఛైర్​పర్సన్ కోవా లక్ష్మీ ప్రజల్ని కోరారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఎక్కడైనా నిత్యావసరాలను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇదే స్పూర్తితో లాక్​డౌన్​ను కొనసాగించాలి: జడ్పీ ఛైర్​పర్సన్

ఇవీ చూడండి: సమాచార మార్పిడిపై జాగ్రత్త

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.