ETV Bharat / state

పునాది దశలోనే డబుల్​ బెడ్​రూమ్​ ఇళ్లు... పక్కా ఇళ్లు వస్తాయనే ఆశలో పేదలు !

author img

By

Published : Aug 30, 2020, 8:22 PM IST

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో డబుల్​ బెడ్​రూమ్​ ఇళ్ల నిర్మాణాలు పునాదుల దశలోనే నిలిచిపోయాయి. నిర్మాణాలు అర్థాంతరంగా నిలిపోవడం వల్ల పక్కా ఇళ్లు వస్తాయని ఆశపడ్డ పేదలకు సొంత గూడు చిరకాల వాంఛగానే మిగిలిపోతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇళ్లు లేని నిరుపేదలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

many people waiting for double bedroom houses in komaram bheem district
పునాది దశలోనే డబుల్​ బెడ్​రూమ్​ ఇళ్లు... పక్కా ఇళ్లు వస్తాయనే ఆశలో పేదలు !

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలు పునాదుల దశలోనే నిలిచిపోయాయి. నిర్మాణ వ్యయం పెరగడం వల్ల గుత్తేదారులు పనులను అర్ధాంతరంగా నిలిపేశారు. పక్కా ఇళ్లు వస్తాయని ఆశపడ్డ పేదలకు సొంత గూడు చిరకాల వాంఛగానే మిగిలిపోతోంది. పనులు మొదలై నాలుగేళ్లు గడుస్తున్నా చేసిన పనులకే బిల్లులు రావడం లేదని, నిర్మాణ వ్యయం అమాంతం పెరిగిపోయినందున గిట్టుబాటు కాదని పనులను నిలిపేశారు.

జిల్లాలో 20,250 ఇళ్లు మంజూరుకాగా 1310కి పరిపాలనా పరమైన అనుమతులు వచ్చాయి. వాటి నిర్మాణ పనులు ఇంకా పునాదుల దశనే దాటలేదు. గూడులేని నిరుపేదలు ఎపుడెప్పుడు డబుల్‌బెడ్‌రూమ్​ ఇళ్లు ఇస్తారా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. శిథిలమైన వాటిల్లో ఉండలేకపోతున్నామని వాపోతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బాగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. దాదాపు పదివేల మంది సొంతిళ్ల కోసం కళ్లల్లో ఒత్తిళ్లు పెట్టుకుని ఎదురుచూస్తున్నారు. కొన్ని మండలాల్లో ఒప్పందాలు చేసుకున్న గుత్తేదార్లు మొహం చాటేయడం వల్ల నిర్మాణాల భవితవ్యం సందిగ్ధంలో పడింది.

పునాది దశలోనే డబుల్​ బెడ్​రూమ్​ ఇళ్లు... పక్కా ఇళ్లు వస్తాయనే ఆశలో పేదలు !

ఇదీ చూడండి: 'రాష్ట్ర అవినీతిపై కేంద్రం డేగ కన్ను వేసింది'

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.