ETV Bharat / state

నాటిన ప్రతిమొక్కనూ సంరక్షించాలి: కలెక్టర్‌

author img

By

Published : Feb 17, 2021, 2:30 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని కోటి వృక్షార్చనలో భాగంగా కుమురం భీం జిల్లా కాగజ్ నగర్‌లో కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ మొక్కలు నాటారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని అధికారులకు తెలిపారు. రేషన్ కార్డు లబ్ధిదారుల సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.

Collector Rahul Raj planted saplings in Kagaznagar, Komaram Bheem district
కోటి వృక్షార్చనలో భాగంగా మొక్కలు నాటిన కలెక్టర్‌

సీఎం కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా కోటి వృక్షార్చనలో భాగంగా కుమురం భీం జిల్లా కాగజ్ ‌నగర్‌లో జిల్లా కలెక్టర్‌ మొక్కలు నాటారు. మున్సిపాలిటీ పరిధిలోని ఎల్లగౌడ్ తోటలో పాలకవర్గ సభ్యులతో కలిసి మొక్కలు నాటి తోటను పరిశీలించారు. తోట అభివృద్ధి పనులను కమిషనర్ శ్రీనివాస్ కలెక్టర్‌కు వివరించారు.

Collector Rahul Raj planted saplings in Kagaznagar, Komaram Bheem district
మున్సిపల్‌ పాలకవర్గం సభ్యులతో కలిసి మొక్కలు నాటుతున్న కలెక్టర్‌

నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. ఈ సేవ కేంద్రాల్లో ఆధార్‌తో చరవాణి నంబర్‌ నమోదుకు రేషన్ కార్డు లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను పలువురు కౌన్సిలర్లు ఆయనకు వివరించారు. వెంటనే ఈ సేవ కేంద్రాన్ని సందర్శించి సమస్య పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి: 'సీఎం నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.