ETV Bharat / state

మంత్రి పుట్టిన రోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు

author img

By

Published : Jul 24, 2020, 2:14 PM IST

ktr birth day celebrations in kagaznagar
మంత్రి పుట్టిన రోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు

మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్​నగర్​లో కోనేరు ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రారంభించారు.

రాష్ట్ర మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్​నగర్​లో సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప... కోనేరు ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగారక్తదానం శిబిరాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తన చేతుల మీదుగా శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం చేసేందుకు వచ్చిన వారందరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించారు. రక్తదానం శిబిరంలో సేకరించిన రక్తాన్ని ఆసిఫాబాద్, మంచిర్యాల రక్తనిధి కేంద్రాలకు అప్పగించారు. ఈ కార్యక్రమంలో పురపాలక వైస్ ఛైర్మన్ గిరీష్ కుమార్, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: కేటీఆర్​కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన హరీశ్​రావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.