ETV Bharat / state

Pilli Akhil Sailor from Telangana : సెయిలింగ్​లో ఖమ్మం యువకుడి సత్తా.. అలలపై అఖిల్​కు అంతర్జాతీయ పతకాలు

author img

By

Published : Aug 21, 2023, 5:02 PM IST

Pilli Akhil Sailor in World Sailing Championship
Pilli Akhil Sailor from Telangana

Pilli Akhil Sailor from Telangana : ఉవ్వెత్తున ఎగిసిపడే అలలతో ఆడితే ఆనందం.. ఆ అలలకి ఎదురెళితే సాహసం. ఆ అలల్ని అధిగమించి సుదూర లక్ష్యం చేరితే విజయం. అలా ఉవ్వెత్తున ఎగిసిపడే అలలపై జాతీయ, అంతర్జాతీయ విజయాలను సాధిస్తున్నాడు ఖమ్మంకు చెందిన యువ సెయిలర్ పిల్లి అఖిల్. తాజాగా స్పెయిన్‌లో జరిగిన వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో మన దేశానికి ప్రాతినిథ్యం వహించి సత్తాచాటిన ఆ యువ సెయిలర్ క్రీడా ప్రయాణం ఇది.

Pilli Akhil Sailor from Telangana సెయిలింగ్​లో ఖమ్మం యువకుడి సత్తా.. అలలపై అఖిల్​కు అంతర్జాతీయ పతకాలు

Pilli Akhil Sailor in World Sailing Championship : అత్యంత సాహోసోపేతమైన క్రీడల్లో సెయిలింగ్ ఒకటి. విసురుగా వచ్చే భారీ సముద్రపు అలల్నీ ఈ క్రీడలో దాటుకుంటూ ముందుకెళ్లాల్సి ఉంటుంది. పైగా ఇతరులతో పోటీ పడుతూ ఒడుపుగా లక్ష్యాన్ని చేరాలి. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ఒక్కోసారి ప్రాణాలకే ప్రమాదం. ఇలాంటి ఎన్నో సమస్యలన్నింటినీ దాటుకుని విజయాలు సాధిస్తూ.. సెయిలింగ్‌ టాప్ ర్యాంకర్‌ కెరీర్‌లో దూసుకెళ్తున్నాడు ఈ యువ క్రీడాకారుడు.

పిల్లి అఖిల్ స్వగ్రామం ఖమ్మం జిల్లాలోని వైరా మండలం కోస్టాల గ్రామం. తల్లిదండ్రులు పిల్లి శరత్ బాబు, ప్రమీల వ్యవసాయదారులు. చిన్నప్పుడే ఇతడిలోని ప్రతిభను గుర్తించి ఈత నేర్పించాడు చిన్నాన్న రాజు. ఎలాగైనా అఖిల్ కూడా ఆటల్లో ఎదగాలని ప్రోత్సాహించాడు. ఈ క్రమంలోనే హకీంపేటలోని స్పోర్ట్స్‌ స్కూల్‌ల్లో చేరాడు ఈ కుర్రాడు. అక్కడ ఇతడిలోని ప్రతిభను చూసి సెయిలింగ్‌ క్రీడ నేర్పేందుకు శిక్షకులు ఎంపిక చేశారు.

Pilli Akhil Youngsailor in India : శిక్షణ సమయంలో అఖిల్‌() చూపుతున్న నేర్పు, ప్రతిభ పాటావాలను గుర్తించి బెంగళూరులోని కేంద్రీయ విద్యాలయంలో ప్రత్యేక శిక్షణ పొందడానికి ఎంపిక చేశారు.అక్కడే పడవ పోటీల్లోప్రత్యేక శిక్షణకు అర్హత సాధించాడు. ఇలా ఐదేళ్ల పాటు సెయిలింగ్‌లో రాటుదేలి.. ఇక వెనుదిరిగి చూడలేదు ఈ యువ క్రీడాకారుడు.

అత్యంత క్లిష్టమైన ఈ ఆటలో జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో సత్తా చాటుతున్నాడు అఖిల్ . తోటి క్రీడాకారిణి అలేఖ్య ఖండూతో కలిసి పతకాల పంట పండిస్తూ.. నెంబర్ వన్ జోడీగా దూసుకెళ్తున్నారు. నాలుగేళ్ల క్రితం అండర్ 19 వరల్డ్ ఛాంపియన్‌షిప్‌కు ఎంపికైన జోడీ వీరిదే. జాతీయ స్థాయి సింగిల్, డబుల్ల్స్ మిక్స్డ్, డబుల్ పోటీల్లో 13 పతకాలు గెలిచాడు అఖిల్. మణిపూర్, షిల్లాంగ్ జాతీయ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించాడు.

ఈ ఏడాది యాచింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన జాతీయ సెయిలింగ్‌ పోటీలలో అఖిల్‌, అలేఖ్య మిక్స్‌డ్‌ డబుల్‌లో అత్యుత్తుమ ప్రదర్శన చూపారు. వీరికి వచ్చిన ర్యాంకు ఆధారంగా వైఏఐ‌‌ వీరిని అంతర్జాతీయ సెయిలింగ్‌ ఛాంపియన్‌షిప్‌కు ఎంపిక చేసింది. అండర్‌ 19లో నాలుగు సంవత్సరాల తర్వాత వరల్డ్‌ ఛాంపియన్‌షిక్‌కి ఎంపికైన జోడీ వీరిదే కావడం విశేషం.

Pilli Akhil and Alekhya Khandu Sailors : సెయిలింగ్‌ పోటీల్లో అనేక పతకాలు సాధించాడు అఖిల్‌ . 12 జాతీయ స్థాయి పోటీల్లో 6 బంగారు, 5 వెండి, ఒక కాంస్య పతకాలు గెలుచుకున్నాడు. అదేవిధంగా 2018 చెన్నైలో జరిగిన అంతర్జాతీయ సెయిలింగ్‌ పోటీల్లో వెండి పతకం సాధించాడు. ఈ ఏడాది జులై 21 నుంచి 27వరకు స్పెయిన్‌లో జరిగిన అంతర్జాతీయ అండన్‌ 19 మిక్సిడ్‌ డబుల్స్‌ పోటీల్లో భారత్‌ తరపున పాల్గొని అలేఖ్యతో కలిసి 8వ స్థానంలో నిలిచాడు.

2024 బ్రెజిల్‌లో జరగబోయే అంతర్జాతీయ ఛాంపియన్‌ షిప్‌లో బంగారు పతకం సాధించడమే లక్ష్యంగా ప్రస్తుతం అఖిల్ కృషి చేస్తున్నాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికంగా చేయూతనిస్తే రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకువస్తాడని ఇతడి కుటుంబీకులు చెబుతున్నారు.

ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించాలనేది జీవిత ఆశయంగా చెబుతున్నాడు అఖిల్‌. సెయిలింగ్‌ ఆటను నేర్చుకోవడానికి తెలుగురాష్ట్రాల్లో వనరులు చాలా తక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఈ ఆట చాలా ఖర్చుతో కూడుకున్నది.. సాహోసోపేతమైనది. తెలంగాణ ప్రభుత్వం ఈ ఆటపై దృష్టి సారించి ప్రోత్సహిస్తే మరింత మంది యువత నేర్చుకునే అవకాశం ఉందని క్రీడాకారులు, క్రీడాభిమానులు చెబుతున్నారు.

"మా చిన్నాన్న మొదటిసారిగా నన్ను ప్రోత్సహించారు. హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్​కు.. ఖమ్మం జిల్లా నుంచి ప్రథమంగా ఎంపికయ్యాను. సెయిలింగ్​లో జాతీయ స్థాయిలో పథకాలు వచ్చాయి. మిక్స్​డ్ డబుల్స్​లో అలేఖ్యతో కలిసి.. స్పెయిన్​లో జరిగిన అండర్ 19 సెయిలింగ్​లో 8వ స్థానం వచ్చింది." - పిల్లి అఖిల్, యువ సెయిలర్

Sailing Week in Hyderabad : హుస్సేన్​సాగర్ అలలపై.. 'సెయిలింగ్.. అదిరెన్'

SAILING: హుస్సేన్​ సాగర్​లో జాతీయ 'సెయిలింగ్'​.. గవర్నర్ బోటింగ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.