ETV Bharat / state

తెలంగాణలో విద్యారంగానికి అధిక ప్రాధాన్యం: మంత్రి సబిత

author img

By

Published : Jan 22, 2021, 3:48 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలంలోని బస్వాపురం గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేసిన కస్తూర్భా గాంధీ విద్యాలయాన్ని ఆమె ప్రారంభించారు.

minister sabitha indra reddy hopes for every child born in the state should excel in the world
'రాష్ట్రంలో పుట్టిన ప్రతీ బిడ్డా ప్రపంచ స్థాయిలో రాణించాలి'

రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డా ప్రపంచ స్థాయిలో అన్ని రంగాల్లో రాణించేలా చదువుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆకాంక్షించారు. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలంలోని బస్వాపురం గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేసిన కస్తూర్భా గాంధీ విద్యాలయాన్ని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​తో కలిసి ఆమె ప్రారంభించారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆ కార్యక్రమంలో భాగంగానే గురకులాలను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. కొవిడ్ సమయంలో పాఠశాలలు మూతపడినప్పటికీ విద్యార్థులకు తరగతుల నిర్వహణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. ఫిబ్రవరి ఒకటి నుంచి 9, 10 తరగతులు, కళాశాలు ప్రారంభమవుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ పాల్గొన్నారు.

ఇదీ చదవండి: ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన నీతిఆయోగ్ బృందం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.