ETV Bharat / state

Puvvada: ఎమ్మెల్యేతో కలిసి డప్పు కొట్టిన పువ్వాడ.. ఎందుకో తెలుసా..

author img

By

Published : Jun 30, 2021, 7:16 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొస్తున్న దళిత సాధికారత పథకానికి రాష్ట్రంలోని ఎస్సీల నుంచి పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. అంబేడ్కర్​ ఆశించిన దళిత వర్గాల ప్రగతికి కేసీఆర్ నిజమైన బాటలు వేస్తున్నారని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు.

CM Dalit empowerment scheme, Minister Puvvada ajay kumar
ముఖ్యమంత్రి దళిత సాధికారత పథకం, మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​

దళిత వర్గాల అభివృద్ధి కోసం నడుం బిగించిన సీఎం కేసీఆర్​కు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు అండదండగా ఉండాలని... రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​ అన్నారు. ఎస్సీల అభ్యున్నతికి ముఖ్యమంత్రి తీసుకొస్తున్న దళిత సాధికారత పథకానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని అభిప్రాయపడ్డారు. పథకాన్ని స్వాగతిస్తూ ఖమ్మం జిల్లాలోని అంబేడ్కర్ సెంటర్ వద్ద దళిత దరువు పేరిట నిర్వహించిన సంబరాల్లో... ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి మంత్రి పాల్గొన్నారు.

ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు...

ముఖ్యమంత్రి దళిత సాధికారత పథకం కింద ప్రతి నియోజకవర్గంలో 100 కుటుంబాలకు ఆర్థికసాయం అందజేయనున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున సాయం అందించనున్నామన్నారు. అనేక విధాలుగా ఎస్సీల అభివృద్ధికి సీఎం కేసీఆర్​ కృషి చేస్తున్నారని అన్నారు. అందరికీ మేలు చేకూర్చే విధంగా ఈ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్సీ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి చెప్పారు.

దాదాపు రూ.1,200 కోట్ల నిధులు...

ఈ పథకం కోసం ఇప్పటికే రాష్ట్ర బడ్జెట్​లో రూ. వెయ్యి కోట్ల నిధులు కేటాయించామన్నారు. వీటికి తోడు మరో రూ.200 కోట్లను అదనంగా ఇచ్చి... మొత్తం రూ.12 వందల కోట్ల నిధులను ఈ ఏడాది ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రానున్న కాలంలో దళిత సాధికారత పథకం కోసం మరిన్ని నిధులు కేటాయించనున్నట్లు చెప్పారు. ప్రతి కుటుంబాన్ని లక్షాధికారులను చేసే దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్​ కృషి చేస్తున్నారని అన్నారు.

డప్పు కొట్టిన మంత్రి పువ్వాడ...

సంబరాల్లో భాగంగా సీఎం కేసీఆర్​కు కృతజ్ఞతగా డప్పుల దరువు మోగించారు. మంత్రి పువ్వాడ, ఎమ్మెల్యే సండ్ర, జిల్లా పరిషత్ ఛైర్మన్ లింగాల కమల్ రాజ్ సైతం స్వయంగా డప్పు కొట్టారు. అనంతరం ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అంబేడ్కర్​ విగ్రహానికి పూలాభిషేకం నిర్వహించారు. అంబేడ్కర్ ఆశించిన దళిత వర్గాల ప్రగతికి సీఎం కేసీఆర్ నిజమైన బాటలు వేస్తున్నారని... ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు.

ముఖ్యమంత్రి దళిత సాధికారత పథకం, మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​

ఇదీ చదవండి: KTR: 'దేశంలో రెండో హరిత విప్లవానికి తెలంగాణ నాంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.