ETV Bharat / state

దేశరాజకీయాలను కేసీఆర్ కొత్త మలుపు తిప్పుతారు: పువ్వాడ

author img

By

Published : Oct 6, 2022, 4:20 PM IST

Puvvada Ajay Kumar: దేశాన్ని పరిపాలించేందుకు ఆదర్శంగా చూపించిన గుజరాత్‌ మోడల్‌ ఫెయిల్యూర్‌ మోడల్‌ అని మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ విమర్శించారు. తెలంగాణ మోడల్‌ గురించి ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని ఆయన పేర్కొన్నారు.

Puvwada Ajay Kumar
Puvwada Ajay Kumar

Puvvada Ajay Kumar: దేశాన్ని పరిపాలించేందుకు ఆదర్శంగా చూపించిన గుజరాత్‌ మోడల్‌ ఫెయిల్యూర్‌ మోడల్‌ అని మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ ఆరోపించారు. తెలంగాణ మోడల్‌ గురించి ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని తెలిపారు. తెరాసను భారత్ రాష్ట్ర సమితిగా మార్చుతూ చేసిన తీర్మానంలో తామంతా భాగస్వాములవటం అదృష్టంగా భావిస్తున్నామని పువ్వాడ అజయ్‌ కుమార్‌ చెప్పారు.

జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌ అవసరం ఎంతైనా ఉందని పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. కేసీఆర్‌ నేతృత్వంలో తెలంగాణ అభివృద్ధితో పాటు దేశ రాజకీయాలు సైతం కొత్త మలుపు తిరుగబోతుందని చెప్పారు. దేశంలో తెలంగాణలో రైతులు, పేదలకు అందుతున్న సంక్షేమ కార్యక్రమాలపై ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం ఆరాతీస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల మధ్య మత విద్వేషాలు సృష్టిస్తున్న పార్టీలకు తగిన బుద్ది చెబుతామని పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు.

"ఒకప్పుడు కృత్రిమ గుజరాత్ మోడల్​ను ప్రజల ముందు పెట్టి దేశంలో పరిపాలన కోసం గుజరాత్​ అంతా ఏదో గొప్పగా అయిపోయిందని చెప్పారు. కానీ ఇప్పటి కూడా అక్కడ కరెంట్, నీటికి ఇబ్బందులు ఉన్నాయి. అలాంటి గుజరాత్ మోడల్ ఫెయిల్యూర్ మోడల్. తెలంగాణ మోడల్ సక్సెస్ మోడల్. ఆ మోడల్ గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అలాంటి చారిత్రాత్మక తీర్మానం చేసిన సమయంలో తెరాసను జాతీయ పార్టీగా ముందుగా తీసుకెళ్లాలనే కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. తెలంగాణకు సీఎంగా ఉంటూనే కేసీఆర్ దేశ రాజకీయాల వైపు అడుగులు వేస్తారు." - పువ్వాడ అజయ్ కుమార్ మంత్రి

నిన్న జాతీయ పార్టీ ప్రకటన కోసం తెలంగాణ భవన్‌లో జరిగిన తెరాస సర్వసభ్య సమావేశంలో.. మంత్రులు, తెరాస ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జడ్పీ ఛైర్‌పర్సన్లు సహా 283 మంది కీలక ప్రతినిధులు పాల్గొని తీర్మానాలపై సంతకాలు చేశారు. పేరును మారుస్తూ తెరాస అధినేత ప్రతిపాదించిన ఏక వాక్య తీర్మానానికి సభ్యులు మద్దతు తెలిపారు. అనంతరం ఆ తీర్మానంపై కేసీఆర్‌ సంతకం చేశారు. ఆ తర్వాత ఆయన చదివి వినిపించి ‘భారత్‌ రాష్ట్ర సమితి’పేరును ప్రకటించారు.

తెలంగాణ మోడల్‌ గురించి ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది

ఇవీ చదవండి: బీఆర్​ఎస్ ఆవిర్భావంతో సంబరాల్లో గులాబీ తమ్ముళ్లు

యాక్సిడెంట్​లో 33మంది మృతి.. ఆ పాప మాత్రం సేఫ్.. చనిపోయిన తల్లి గుండెను 12గంటలు హత్తుకుని..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.