ETV Bharat / state

'పోతిరెడ్డిపాడుతో దక్షిణ తెలంగాణ ఏడారి'

author img

By

Published : Jun 10, 2020, 2:46 PM IST

పోతిరెడ్డిపాడుతో దక్షిణ తెలంగాణ ఏడారిగా మారుతుందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఖమ్మం కలెక్టర్‌ కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు.

cpi protest against ap go 203 in kammam district
'పోతిరెడ్డిపాడుతో దక్షిణ తెలంగాణ ఏడారిగా మారుతుంది'

జీవో నెంబర్‌ 203 ద్వారా ఆంధ్ర సీఎం జగన్‌ 80 వేల క్యూసెక్కుల కృష్ణా నీటిని తరలించేందుకు చూస్తుంటే సీఎం కేసీఆర్​ ఏం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రశ్నించారు. ఖమ్మం కలెక్టర్‌ కార్యాలయం ఎదుట.. సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు. జీవో నెంబర్‌ 203ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

'పోతిరెడ్డిపాడుతో దక్షిణ తెలంగాణ ఏడారిగా మారుతుంది'

ముఖ్యమంత్రి కేసీఆర్‌ జగన్‌తో లాలూచీ పడ్డారని ఆరోపించారు. పోతిరెడ్డిపాడుతో దక్షిణ తెలంగాణ ఏడారిగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ ఒక ప్రాంతానికి నాయకుడిలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా కూడా పెద్దగా జిల్లాకు లాభం చేకూరదన్నారు. ఆంధ్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను ఉపసంహరించుకునేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.

ఇదీ చదవండి: అంతర్రాష్ట్ర సర్వీసులపై నిర్ణయం ఆ తర్వాతే : కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.