ETV Bharat / state

'లక్ష కోట్ల ప్రజాధనమంతా గోదావరి పాలు - చర్యలు తీసుకోకపోతే కేంద్రం పాత్ర ఉన్నట్లు భావించాల్సి ఉంటుంది'

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 4, 2023, 6:56 PM IST

Dam Safety Report on Medigadda Barrage
Bhatti Vikramarka Respond on Dam Safety Report

Bhatti Vikramarka Respond on Medigadda Barrage Issue: కేసీఆర్​ ప్రభుత్వం రూ.లక్ష కోట్ల ప్రజాధనాన్ని గోదావరిలో పోసిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. రూ.లక్ష కోట్లు ఖర్చు చేసిన ప్రాజెక్టులో.. నేడు నీరు నింపుకునే పరిస్థితి లేదని దుయ్యబట్టారు. ఈ నిర్లక్ష్యంపై కేంద్రం చర్యలు తీసుకోకపోతే.. ఇందులో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఉన్నట్లు భావించాల్సి ఉంటుందని చురకలంటించారు.

Bhatti Vikramarka Respond on Medigadda Barrage Issue : కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం డ్యామ్​ సేఫ్టీ నింబంధనలను ఉల్లఘించిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. మున్ముందు కూడా మేడిగడ్డ బ్యారేజీతో(Medigadda issue) ముప్పు ఉందని కేంద్ర బృందం.. తమ నివేదికలో పేర్కొందన్నారు. నాణ్యత లేకుండా నిర్మించడంతో మొత్తం బ్యారేజీ పని చేయని స్థితి వచ్చిందని మండిపడ్డారు. ప్రస్తుతం బ్యారేజీకి తలెత్తిన సమస్యను పరిష్కరించేంత వరకు డ్యామ్​ను ఉపయోగించే పరిస్థితి లేదని కేంద్రబృందం స్పష్టం చేసిందన్నారు.

'సాధించుకున్న తెలంగాణలో నెరవేరని బలహీన వర్గాల కలలు'

Telangana Assembly Elections 2023 : ఇప్పుడు బ్యారేజీకి వచ్చిన సమస్య.. ఇతర బ్లాకుల్లో కూడా తలెత్తితే మొత్తం డ్యామ్​ నిర్మాణమే వృథా అవుతోందని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం బ్యారేజీని మళ్లీ నిర్మించాల్సిన పరిస్థితి రావొచ్చని డ్యామ్ సేఫ్టీ బృందం చెప్పిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని ఇతర బ్యారేజీల్లో కూడా పలు సమస్యలు వెలుగులోకి వస్తున్నాయన్నారు. అన్నారం బ్యారేజీలో సీపేజీలు వెలుగులోకి వచ్చాయన్నారు.

కేసీఆర్​ ప్రభుత్వం రూ.లక్ష కోట్ల ప్రజాధనాన్ని గోదావరిలో పోసిందని భట్టి దుయ్యబట్టారు. రూ.లక్ష కోట్లు ఖర్చు చేసిన ప్రాజెక్టులో.. నేడు నీరు నింపుకునే పరిస్థితి లేదని మండిపడ్డారు. ఎవరైనా చిన్న ఇల్లు కట్టినా.. ఎంతో ప్రణాళికయుతంగా ముందుకెళ్తారని.. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్​ రూ.లక్ష కోట్ల ప్రాజెక్టు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని దుయ్యబట్టారు. కమీషన్లకు కక్కుర్తి పడి ప్రాజెక్టు నాణ్యత గురించి ప్రభుత్వం పట్టించుకోలేదని ధ్వజమెత్తారు.

Dam Safety Report on Medigadda Barrage : కాంగ్రెస్​ ప్రభుత్వం గతంలో ఎన్నో ప్రాజెక్టులను నిర్మించిందని భట్టి గుర్తు చేశారు. కాంగ్రెస్​ హయాంలో దశాబ్దాల క్రితం కట్టిన ప్రాజెక్టులు చెక్కు చెదరలేదని పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణం విషయంలో.. కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా విఫలం అయ్యాయని దుయ్యబట్టారు. కాళేశ్వరం నిర్మిస్తున్నప్పుడే కేంద్రం నిశితంగా పరిశీలించి ఉంటే బాగుండేదన్నారు. డ్యామ్ సేఫ్టీ బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రం చర్యలు తీసుకోకపోతే.. ఇందులో కేంద్ర ప్రభుత్వం పాత్ర ఉన్నట్లు భావించాల్సి ఉంటుందని చురకలంటించారు. బీఆర్​ఎస్​, బీజేపీ కలిసే ఈ దోపిడీకి పాల్పడినట్లు భావించాల్సి ఉంటుందన్నారు. ప్రజాధనంతో నిర్మిస్తున్న ప్రాజెక్టుల పట్ల కేంద్రం కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉందన్నారు.

"రాష్ట్ర ప్రభుత్వం డ్యామ్ సేఫ్టీ నింబంధనలను ఉల్లఘించింది. మున్ముందు కూడా బ్యారేజీతో ముప్పు ఉందని కేంద్ర బృందం.. తమ నివేదికలో పేర్కొంది. కేసీఆర్​ ప్రభుత్వం రూ.లక్ష కోట్ల ప్రజాధనాన్ని గోదావరిలో పోసింది. ఈ నిర్లక్ష్యంపై కేంద్రం చర్యలు తీసుకోకపోతే.. ఇందులో కేంద్ర ప్రభుత్వం పాత్ర ఉన్నట్లు భావించాల్సి ఉంటుంది". - భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత

'కేసీఆర్ నిర్లక్ష్యంతో లక్ష కోట్ల ప్రజాధనం గోదావరి పాలు'

అన్నారం బ్యారేజీని పరిశీలించిన కేంద్ర డ్యాంసేఫ్టీ బృందం

'పనిమంతుడు పందిరి వేస్తే కుక్క తోక తగిలి కూలిందన్నట్లు అయ్యింది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.