ETV Bharat / state

ప్రాణం తీసిన గుంత.. తప్పించబోయి యువకులు మృతి

author img

By

Published : Dec 11, 2019, 7:42 PM IST

ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై అప్పటిదాకా సరదాగా ప్రయాణించారు. రహదారిపై ఉన్న గుంతను తప్పించాలని చూశారు. కానీ ఆ యువకులకు వేగంగా వచ్చిన ఆటో రూపంలో మృత్యువు ఎదురుపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.

TWO YOUNG BOYS DIED IN ACCIDENT AT ARNAKONDA
TWO YOUNG BOYS DIED IN ACCIDENT AT ARNAKONDA

కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం అర్నకొండలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ధర్మారం మండలం మల్లాపూర్​కు చెందిన కమలేష్, సాగర్ అనే యువకులు ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో రహదారిపై ఉన్న గుంతను తప్పించబోయి ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువకుడు తీవ్ర గాయాలపాటు కాగా... ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

గుంతను తప్పించబోయి... అనంతలోకాలకు యువకులు...

ఇదీ చూడండి : సంక్షేమ బోర్డు.. సరకుల రవాణా.. బస్సుల తగ్గింపు!

TG_KRN_72_11_TWO_DIED_ACCIDENT_AV_TS10128 From: Sayed Rahmath Choppadandi phone:9441376632 ----------------- యాంకర్ పార్ట్: కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం అర్నకొండ లో జరిగిన రహదారి ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన కమలేష్ , సాగర్ లు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో యువకుడు న్యాతరి నరేష్ తీవ్రంగా గాయపడగా ఆసుపత్రికి తరలించారు. బైక్ పై ప్రయాణిస్తున్న యువకులు రహదారి గుంతను తప్పించే ప్రయత్నంలో ఎదురుగా ఆటో వేగంగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.