ETV Bharat / state

'ఆనాటి ఆలోచనే నేటి ఐటీ టవర్​గా మారింది'

author img

By

Published : Feb 10, 2020, 2:45 PM IST

తెలంగాణ ఏర్పడ్డాక తాను ఎంపీగా, గంగుల కమలాకర్​ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కరీంనగర్​లో ఐటీ ఇంక్యుబేషన్​ సెంటర్​ ఏర్పాటు చేయాలని ఆలోచించామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద కుమార్​ అన్నారు. ఈనెల 18న కరీంనగర్​లో ఐటీ టవర్​ ప్రారంభం కానుందని తెలిపారు.

telangana state planning commission wise president vinod kumar about karimnagar it tower
'ఆనాటి ఆలోచనే నేటి ఐటీ టవర్​గా మారింది'

'ఆనాటి ఆలోచనే నేటి ఐటీ టవర్​గా మారింది'

కరీంనగర్​లో ఏర్పాటైన ఐటీ టవర్​తో జిల్లాలోని యువతతో పాటు ఉత్తర తెలంగాణలోని విద్యార్థులకు మంచి ఉద్యోగాలు లభిస్తాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్​పల్లి వినోద్​ కుమార్​ అన్నారు.

తాను ఎంపీగా, గంగుల కమలాకర్​ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నగరంలో ఐటీ ఇంక్యుబేషన్​ సెంటర్​ ఏర్పాటు చేయాలన్న ఆలోచనే ఈరోజు ఐటీ టవర్​గా మార్పు చెందిందని తెలిపారు. అనేక అంతర్జాతీయ కంపెనీలు నగరానికి వచ్చేందుకు దోహదపడిందన్నారు.

టెక్​ మహేంద్రా వంటి కంపెనీలు నగరంలో తమకు భూమి కేటాయిస్తే వారి కంపెనీలు స్వయంగా వారే నిర్మించుకుంటామంటున్నాయని వినోద్​ పేర్కొన్నారు. ఈ నెల 18న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​ చేతుల మీదుగా నగరంలోనీ ఐటీ టవర్​ ప్రారంభమవుతుందని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.