ETV Bharat / state

Modern Dobighat in karimnagar : కరీంనగర్​లో అందుబాటులోకి అధునాతన దోబీఘాట్.. ఒకేసారి 60 మంది పని చేసుకునేలా ఏర్పాట్లు

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 8, 2023, 8:47 AM IST

Modern Dobighat in karimnagar : రజకుల కులవృత్తిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అధునాతన యాంత్రీకృత దోబీఘాట్ ఏర్పాటు చేయడంతో ఆ వృత్తిదారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. కరీంనగర్‌లోని గోదాంగడ్డ ప్రాంతంలో రూ.2 కోట్లతో అధునాతన దోబీఘాట్‌ను సర్కారు నిర్మించింది. అత్యాధునిక సాంకేతికత కలిగిన యంత్రాలు, సకల సౌకర్యాలు ఉండటంతో.. తమ కష్టాలు గట్టెక్కుతాయని రజకులు హర్షం వ్యక్తం చేశారు. స్మార్ట్‌సిటీలో భాగంగా మరిన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

Gangula Kamalakar on Dhobi Ghats
Karimnagar Dhobi Ghat Details

Modern Dobighat in karimnagar కరీంనగర్​లో అందుబాటులోకి అధునాతన దోబీఘాట్ ఒకేసారి 60 మంది పని చేసుకునేలా ఏర్పాట్లు

Modern Dobighat in karimnagar : స్మార్ట్‌ సిటీలో భాగంగా.. కరీంనగర్‌లో రజకుల సౌకర్యార్థం మోడ్రన్ దోబీఘాట్(Modern Dobighat) నిర్మాణాన్ని ప్రభుత్వం పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 142 అర్బన్ లోకల్ బాడీస్ పరిధిలో.. 142 మోడ్రన్ దోబీఘాట్‌లను నిర్మాణం చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే సిరిసిల్ల, సిద్దిపేట తదితర పట్టణాల్లో ఏర్పాటు చేయగా.. ఇప్పుడు కరీంనగర్‌లో 3 మోడ్రన్ దోబీఘాట్లను అందుబాటులోకి తెచ్చారు. ఇందులో అత్యాధునిక టెక్నాలజీ కలిగిన వాషింగ్ యంత్రాలు ఉన్నాయి. ఒకేసారి 60 మంది రజకులు తమ పనులు చేసుకునేందుకు వీలుగా సౌకర్యాలు కల్పించారు. రజక వృత్తి ఆధునిక సొబగులు దిద్దుకుంటే.. తమ కులవృత్తి పట్ల యువత ఆసక్తి చూపుతుందని మంత్రి గంగుల కమలార్‌ అన్నారు. తద్వారా ఉపాధి కోసం ఇతర దేశాలకు వలసలు వెళ్లే పరిస్థితికి అడ్డుకట్ట వేయొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.

"తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు బట్టలు ఉతికేందుకు నీళ్లు ఉండేవి కాదు. ఉన్న వాటితోనే బట్టలు ఉతికితే ఆ నీటిలో జలగలు, కలుషితమైన నీరు.. వీటి వల్ల వ్యాధులు వచ్చేవి. దీనివల్ల రజక వృత్తి చేసిన ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడేవారు. సంపాదించింది అంతా ఆస్పత్రి ఖర్చులకే వెళ్లిపోయేది. రజక వృత్తి వారు గౌరవంగా బతకాలనే.. ఈ నిర్ణయం తీసుకున్నాం. ఒక రోజుకు 2500 బట్టలు ఉతికి, ఇస్త్రీ చేసే సామర్థ్యం ఉన్న అధునాతన మిషనరీని ఏర్పాటు చేశాం. కరీంనగర్​లో పెట్టే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది."- గంగుల కమలాకర్‌, మంత్రి

Gangula Talks With Ration Dealers : ఆ రెండు సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తా: గంగుల

Gangula Kamalakar Inaugurate Dhobi Ghat in Karimnagar : ఉమ్మడి జిల్లాలోని సిరిసిల్ల వెంకంపేటలో యాంత్రీకృత దోబీఘాట్‌ను ప్రారంభించారు. తాజాగా కరీంనగర్‌లోనూ గంటకు ఒక సైకిల్‌ చొప్పున 240 బట్టలు ఉతికి ఇస్త్రీ కూడా చేసే విధంగా యంత్రాల రూపకల్పన చేశారు. దీని వల్ల తమకు ఎంతో ఉపయోగం కలుగుతుందని రజకులు హర్షం వ్యక్తం చేశారు. రజక వృత్తిలో పాత తరం వాళ్లే తప్ప నేటి యువత ఆసక్తి చూపడం లేదనే నానుడికి ప్రభుత్వం స్వస్తి పలికే విధంగా చర్యలు తీసుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. గతంలో దుస్తులు ఉతకడం వల్ల కొన్నిసార్లు తమ ఆరోగ్యం దెబ్బతినేదని.. ఈ మాడ్రన్‌ దోబీఘాట్‌తో ప్రస్తుతం ఆ పరిస్థితి పోయిందని వెల్లడించారు. ఆధునిక దోబీఘాట్‌ నిర్మించడమే కాకుండా అవసరమైన వారికి శిక్షణ కూడా ఇప్పించారు. కులవృత్తిదారులకు 250 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌ ఇస్తుండటంతో.. ఆయా వృత్తుల పట్ల ఆదరణ పెరుగుతోందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Rice Millers Association meet Gangula : "ఆంక్షలు అమలుచేయకుండా.. ఎఫ్​సీఐ బియ్యం సేకరించాలి"

Gangula kamalakar on BC 1Lakh Scheme : 'ప్రతినెలా 5లోపు పరిశీలన పూర్తైన వారికి 15న రూ.లక్ష ఆర్థికసాయం'

Telangana BC Rs 1 Lakh Scheme 2023 : బీసీలకు ఆర్థికసాయం దరఖాస్తుల గడువు పెంచేది లేదు : గంగుల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.