ETV Bharat / state

Telangana BC Rs 1 Lakh Scheme 2023 : బీసీలకు ఆర్థికసాయం దరఖాస్తుల గడువు పెంచేది లేదు : గంగుల

author img

By

Published : Jun 20, 2023, 4:40 PM IST

Updated : Jun 20, 2023, 5:36 PM IST

BC BANDHU
BC BANDHU

16:35 June 20

Telangana BC Rs 1 Lakh Scheme 2023 : రూ.లక్ష ఆర్థికసాయం దరఖాస్తుల గడువు పెంచేది లేదు : మంత్రి గంగుల

బీసీలకు ఆర్థికసాయం దరఖాస్తుల గడువు పెంచేది లేదు : గంగుల

BC Rs 1 Lakh Scheme In Telangana : బీసీల్లోని కులవృత్తులు, చేతివృత్తుల వారికి ఆర్థిక సాయం రూ.లక్ష అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పథకానికి నేటితో దరఖాస్తుకు గడువు ముగిసిపోతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గడువు పెంచుతుందని ఆశగా ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు నిరాశే మిగిలింది. దరఖాస్తుల గడువు పెంచేది లేదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ స్పష్టం చేశారు. ఇవాళ్టి వరకు వచ్చిన దరఖాస్తులను మాత్రమే పరిశీలిస్తామని మంత్రి తెలిపారు. లబ్ధిదారులకు జులై 15న చెక్కులు పంపిణీ చేస్తామని ఈ సందర్భంగా చెప్పారు. బీసీ రుణాల పంపిణీ నిరంతరం జరిగే ప్రక్రియ అని.. ఈ రుణాలకు మళ్లీ దరఖాస్తులు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరో విడత దరఖాస్తులకు మరో గడువు తేది ఉంటుందని మంత్రి గంగుల కమలాకర్‌ వివరించారు.

1 Lakh Scheme in Telangana update : బీసీ వర్గాల్లోని కులవృత్తులు, చేతివృత్తిదారులకు రూ.లక్ష ఆర్థిక సాయం చేసేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఈ వర్గాలకు చెందిన వారు నానా అవస్థలు పడుతున్నారు. రూ.లక్ష కోసం దరఖాస్తు చేసుకోవడానికి తప్పనిసరిగా కుల, ఆదాయ పత్రాలు కచ్చితంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. అందుకోసం మీసేవ సెంటర్లలో, తహశీల్దార్‌ కార్యాలయాల్లో ప్రజలు పడిగాపులు కాస్తున్నా.. సర్వర్లు మొరాయించి వారికి నిరాశే ములుగుతున్నాయి. ప్రజలు ఈ పథకం గడువు పెంచాలని ప్రభుత్వాన్ని కోరుకున్నా.. మంత్రి ప్రకటనతో తీవ్ర నిరాశనే మిగిలింది.

"ప్రతినెల 15వ తేదీన కచ్చితంగా బీసీలకు రూ.లక్ష చెక్కులు ఇవ్వాలి. ఇప్పటికీ నాలుగు నుంచి ఐదు లక్షల ఆప్లికేషన్లు వస్తాయి. మరి వారికి చెక్కులు ఇవ్వాలంటే 20 నుంచి 25రోజులు ఎంక్వైరీ చేయాల్సి వస్తుంది. ఎవరైతే ఆఫ్లై చేసుకున్నారో వారికి కచ్చితంగా చెక్కులు అందించాలి. ఇది నిరంతర ప్రక్రియ. అప్లికేషన్లు తీసుకుంటూపోతే చెక్కులు ఎప్పుడు ఇస్తాం. ఇప్పుడు ఆఫ్లై చేసిన వారికి చెక్కులు అందించిన తర్వాత రెండో విడతలో మళ్లీ అప్లికేషన్‌లను తీసుకుంటాం." - గంగుల కమలాకర్‌, బీసీ సంక్షేమ శాఖ మంత్రి

దరఖాస్తు ఆన్‌లైన్‌కు ఎన్నో అవస్థలు : రూ.లక్ష ఆర్థిక సాయానికి కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తప్పని సరి కావడంతో.. రాష్ట్రంలోని ఏ మీ సేవలో చూసిన జనం పడిగాపులు కాస్తున్నారు. నిత్యం 50 మంది వరకు వెళ్లే మీసేవలకు.. ఇప్పుడు ఆర్థిక సాయాన్ని ప్రకటించగానే 400 మంది వెళుతున్నారు. దీనితో సర్వర్లు మొరాయిస్తున్నాయి. ఈ పథకాన్ని ప్రారంభించిన దగ్గర నుంచి ఇవే అవస్థలు పడ్డామని దరఖాస్తుదారులు పేర్కొన్నారు.

1 Lakh Scheme BCs in Telangana : ఈ పథకాన్ని దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 9వ తేదీన సంక్షేమ దినోత్సవం రోజును ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతులు మీదగా మంచిర్యాలలో కులవృత్తులు, చేతివృత్తులు చేసే బీసీలకు ఆర్థిక సాయం ప్రారంభించారు. అదే రోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం బీసీ సంక్షేమ శాఖ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చి.. జూన్‌20ను దరఖాస్తును చివరి తేదీ అని ప్రకటించారు.

ఇవీ చదవండి :

Last Updated : Jun 20, 2023, 5:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.