ETV Bharat / state

'రెండు పడక గదుల ఇళ్లు.. పేదల జీవితాల్లో వెలుగులు'

author img

By

Published : Dec 19, 2021, 6:00 PM IST

Gangula Kamalakar: 'రెండు పడక గదుల ఇళ్లు..  పేదల జీవితాల్లో వెలుగులు'
Gangula Kamalakar: 'రెండు పడక గదుల ఇళ్లు.. పేదల జీవితాల్లో వెలుగులు'

Gangula Kamalakar on Double bedroom: రెండు పడక గదుల ఇళ్లు పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు. కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి మండలం కమాన్‌పూర్‌లో గతంలో నిర్మించిన 67 ప్రభుత్వ గృహాల ప్రారంభోత్సవానికి ఆయన హాజరయ్యారు. లబ్ధిదారులను ఎంపిక చేసి వారితో గృహప్రవేశం చేయించారు. ప్రభుత్వం అందజేసిన ఇళ్లను ఎవరికైనా విక్రయించినా, అద్దెకిచ్చినా కఠిన చర్యలుంటాయని మంత్రి హెచ్చరించారు.

Gangula Kamalakar on Double bedroom: రెండు పడక ఇళ్ల కేటాయింపుతో నిరుపేదల జీవితాల్లో వెలుగులు నిండాయని రాష్ట్ర పౌర సరఫరాలు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా కొత్తపెల్లి మండలం కమాన్​పూర్ గ్రామంలో నిర్మించిన 67 డబుల్ బెడ్​రూం ఇళ్లను జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్​తో కలిసి మంత్రి లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి గృహ ప్రవేశం చేయించారు. కరీంనగర్ జిల్లాలోనే తొలిసారి కమాన్​పూర్ గ్రామంలో డబుల్ బెడ్​రూం ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశామని మంత్రి గంగుల కమలాకర్​ తెలిపారు. నిర్మించిన ఇళ్లకు విద్యుత్ మీటర్లు, తాగునీటి సరఫరా కల్పించినట్లు ఆయన అన్నారు. నిరుపేద ప్రజలకు సొంత ఇళ్ల కలను సాకారం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తండ్రి లాంటి వాడని, దైవంతో సమానమని, దైవ స్వరూపులని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్​కు మంత్రి గంగుల కమలాకర్ కృతజ్ఞతలు తెలిపారు.

వెంటనే డబుల్​ బెడ్​రూం ఇళ్లలోకి మారాలి..

minister gangula kamalakar: మొత్తం 67 ఇళ్లలో కమాన్​పూర్ గ్రామం రాములపల్లిలో 47 కుటుంబాలు ఎల్​ఎండీ ముంపుకు దగ్గరగా ఉన్నాయని, వారికి పునరావాసం కింద ఇళ్లు కేటాయించామని ఆయన తెలిపారు. 47 మందిలో 36 కుటుంబాలకు డబుల్​ బెడ్ రూం ఇళ్లు కేటాయించామని , మిగిలిన 11 మందికి గ్రామసభ ద్వారా అర్హులైన వారికి అధికారులు కేటాయిస్తారని వెల్లడించారు. మిగిలిన డబుల్ బెడ్​రూం ఇళ్లను కమాన్​పూర్ గ్రామస్థులకు లాటరీ ద్వారా కేటాయించామని, వారందరూ కుటుంబసభ్యులతో సహా సంతోషంగా గృహప్రవేశాలు చేశారని మంత్రి తెలిపారు. రాములపల్లి గ్రామస్థులు గృహాలను వెంటనే ఖాళీ చేసి నూతనంగా కేటాయించిన డబుల్ బెడ్​రూం ఇళ్లలోకి మారాలని ఆయన కోరారు.

ఎవరికి అమ్ముకోరాదు.. కిరాయికి ఇవ్వరాదు

ఈ డబుల్ బెడ్​రూం ఇళ్లను లబ్ధిదారులు ఎవరికి అమ్ముకోరాదని, ఇతరులకు కిరాయికి ఇవ్వరాదని, ఇది చట్టరీత్యా నేరమన్నారు. లబ్ధిదారులు మాత్రమే సొంత డబుల్ బెడ్​రూం ఇళ్లలో నివసించాలని ఆయన కోరారు. డబుల్ బెడ్​రూం ఇళ్లు రానివారు అధైర్య పడవద్దని.. అర్హులైన వారికి ఇళ్లు కేటాయిస్తామని మంత్రి తెలిపారు.

అది చట్టరీత్యా నేరం

56 ఇళ్లను ఈ రోజు గృహప్రవేశం చేయించాం. మీ అందరికి ఇది శుభవార్త. పునరావాసం కింద ఇళ్ల పొందిన లబ్ధిదారులు వెంటనే డబుల్​ బెడ్​రూం ఇళ్లలోకి మారిపోవాలి. ఈ ఇళ్లు కిరాయికి ఇస్తాం అంటే మాత్రం ప్రభుత్వం ఊరుకోదు. ఎవరికి కట్టిస్తే వారే ఆ ఇంట్లో ఉండాలి. ఇళ్లను అమ్మడం గానీ, కిరాయికి ఇవ్వడం చేస్తే దానిని చట్టరీత్యా నేరంగా భావిస్తాం. -గంగుల కమలాకర్​, రాష్ట్ర పౌర సరఫరాలు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి

Gangula Kamalakar: 'రెండు పడక గదుల ఇళ్లు.. పేదల జీవితాల్లో వెలుగులు'

ఇదీ చదవండి:

Corona Vaccine to Old Woman : వ్యాక్సిన్ తీసుకోగానే మహిళకు పూనకం.. షాక్​లో వైద్యసిబ్బంది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.