ETV Bharat / state

కొవిడ్​ నివారణ సెన్సార్ల ఆవిష్కరణకు కలెక్టర్ అభినందన

author img

By

Published : Apr 29, 2020, 12:08 AM IST

కరీంనగర్​కు చెందిన అక్కాచెల్లెళ్లు తయారుచేసిన కొవిడ్​ నివారణ సెన్సార్లను జిల్లా కలెక్టర్​ శశాంక ముందు ఆవిష్కరించారు. వాటిని పరీక్షించిన కలెక్టర్​.. కరోనా నివారణకు ఇలాంటి ప్రయోగాలు, ఆవిష్కరణలు ఎంతో దోహదపడతాయని అన్నారు.

karimnagar  collector appreciates the inventions of covid prevention sensors
కొవిడ్​ నివారణ సెన్సార్ల ఆవిష్కరణలకు కలెక్టర్ అభినందన

కరోనా వ్యాప్తి నివారణకు ప్రయోగాలు, ఆవిష్కరణలు ఎంతో దోహదపడతాయని జిల్లా కలెక్టర్ కె.శశాంక అన్నారు. కరీంనగర్​కు చెందిన అక్కాచెల్లెళ్లు శ్వేత, స్నేహలు కరోనా వ్యాప్తి నివారణకు శానిటైజర్​తో చేతులు శుభ్రపరుచుకొని రావాలని, కరచాలనం చేయొద్దని, భౌతిక దూరం పాటించేలా హెచ్చరించే ఐడీ కార్డు, కొవిడ్ – 19 స్మార్ట్ గడియారం తయారుచేయడం ఎంతో అభినందనీయమని అన్నారు. జిల్లా కలెక్టర్ ఛాంబర్​లో అక్కా చెల్లెళ్లు తయారు చేసిన ప్రయోగాలను జిల్లా కలెక్టర్ కె.శశాంక ముందు ఆవిష్కరించారు.

ప్రతి ఒక్కరు ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని సమాజానికి ఉపయోగపడే విధంగా ఆవిష్కరణలు చేయాలని పేర్కొన్నారు. ప్రస్తుతం వారు తయారు చేసిన ఆవిష్కరణలను కార్యాలయాలకు ఉపయోగపడే విధంగా తయారుచేసినట్లైతే వాటికి అయిన ఖర్చు ప్రభుత్వపరంగా భరించడమే కాకుండా... కార్యాలయాలలో ఉపయోగించుకొనేందుకు కొనుగోలు చేస్తామని కలెక్టర్ శశాంక హామీ ఇచ్చారు.

ఇవీ చూడండి: సెప్టెంబర్​ నాటికి కరోనా వ్యాక్సిన్ సిద్ధం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.