ETV Bharat / state

JEEVAN REDDY: 'నీటి దోపిడీని అరికట్టకపోతే సీఎంగా కొనసాగే నైతిక హక్కులేదు'

author img

By

Published : Jun 23, 2021, 9:15 PM IST

jeevan reddy
JEEVAN REDDY: 'నీటి దోపిడీని అరికట్టకపోతే సీఎంగా కొనసాగే నైతిక హక్కులేదు'

కృష్ణా జలాలు దోపిడీకి గురైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకుని ప్రయోజనం ఏమిటని కాంగ్రెస్​ ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి ప్రశ్నించారు. నీటి దోపిడీని అరికట్టకపోతే కేసీఆర్​కు ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక హక్కు లేదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించక పోతే కాంగ్రెస్ పార్టీ ఆందోళన ఉద్ధృతం చేస్తుందని జీవన్‌రెడ్డి హెచ్చరించారు.

కృష్ణాజలాల దోపిడీని అరికట్టకపోతే కేసీఆర్‌కు ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక హక్కులేదని కాంగ్రెస్​ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. కృష్ణాజలాలు దోపిడీకి గురైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకొని ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. గత ఆరునెలలుగా పనులు సాగుతుంటే నిద్రపోయిన కేసీఆర్.. హఠాత్తుగా నిద్రలేచి లేఖలు రాస్తే పనులు జరగవని ఆయన పేర్కొన్నారు.

ప్రభుత్వం ప్రత్యక్ష కార్యాచరణకు దిగాలని సూచించారు. ఆనాడు పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచితేనే తెలంగాణ ఉద్యమానికి ఊతం ఇచ్చిందని.. ఇప్పుడు మరో ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉందన్నాపు, ప్రభుత్వం వెంటనే స్పందించక పోతే కాంగ్రెస్ పార్టీ ఆందోళన ఉద్ధృతం చేస్తుందని జీవన్‌రెడ్డి హెచ్చరించారు.

'నీటి దోపిడీని అరికట్టకపోతే సీఎంగా కొనసాగే నైతిక హక్కులేదు'

నిద్రపోతున్నరా?..

మేం అడ్డుకుంటామని మంత్రులు స్టేట్​మెంట్లు ఇస్తున్నరు. ఆరు నెలల నుంచి ఏం చేస్తున్నరు.. నిద్రపోతున్నరా?. ఏ విధంగా అడ్డుకుంటారో చెప్పాలి. ఈ విషయం లేఖలతో నిలిచిపోయేది కాదు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి షెకావత్​ లేదా ప్రధానమంత్రిని కలిసి మాట్లాడాలి. భాజపాకు ఈ విషయంలో బాధ్యత లేదా. అవసరమైతే రాష్ట్రపతి తలుపులు తట్టాలి. ఆనాడు తెలంగాణ ఉద్యమం ఏ విధంగా ప్రాధాన్యత సంతరించుకుందో... కృష్ణా నదీ జలాల దోపిడీ అంతకంటే ప్రాధాన్యత గల అంశం. నీటి దోపిడీని అరికట్టకపోతే ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక హక్కు కేసీఆర్​కు లేదు. -జీవన్​ రెడ్డి, కాంగ్రెస్​ ఎమ్మెల్సీ

ఇదీ చదవండి: Bhatti: ఏపీ అక్రమ ప్రాజెక్టులపై ఏడాది క్రితమే హెచ్చరించాం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.