ETV Bharat / state

KTR Speech at Kamareddy Public Meeting : ఆ కారణంతోనే కేసీఆర్‌.. కామారెడ్డి నుంచి పోటీకి దిగుతున్నారు : కేటీఆర్

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 7, 2023, 3:37 PM IST

Updated : Oct 7, 2023, 4:22 PM IST

MINISTER KTR
KTR Speech at Kamareddy Public Meeting

KTR Speech at Kamareddy Public Meeting : కామారెడ్డి డిగ్రీ కళాశాల మైదానంలో మినీ స్టేడియం నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్​ పోటీపై ఆయన స్పష్టతనిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్దన్ విజ్ఞప్తి మేరకే కేసీఆర్ ఇక్కడి నుంచి ఎన్నికల బరిలో దిగుతున్నారని వెల్లడించారు.

KTR Speech at Kamareddy Public Meeting : ప్రస్తుతం కామారెడ్డి నియోజకవర్గం గురించి రాష్ట్రమంతా చర్చ జరుగుతోందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌.. కామారెడ్డి నియోజకవర్గాన్ని ఎందుకు ఎంచుకున్నారని అంతా చర్చించుకుంటున్నారన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో పోటీ చేయాలని స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్దన్ కేసీఆర్​ను అడుగుతారని తాను అనుకోలేదన్నారు. కామారెడ్డి డిగ్రీ కళాశాల మైదానంలో మినీ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు.

Minister KTR Speech in Warangal Tour : పింఛన్ల పెంపు, ఆడబిడ్డలకు సాయంపై త్వరలోనే శుభవార్త: మంత్రి కేటీఆర్

Minister KTR Kamareddy Tour : ఈ నియోజకవర్గం నంబర్​వన్‌గా ఉండాలనే గంప గోవర్దన్ కేసీఆర్‌ను పోటీ చేయమని అడిగారని కేటీఆర్ అన్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా బలమైన ఆశయం.. దృఢమైన సంకల్పం ఉంటుందని పేర్కొన్నారు. కేసీఆర్‌ నిర్ణయాలు సంచలనంగా ఉంటాయని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్​.. బలమైన ఆశయంతో కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.

KTR on Hyderabad Development : 'హైదరాబాద్‌పై చిన్న మచ్చ పడినా.. అందరికీ ఇబ్బంది కలుగుతుంది'

కామారెడ్డి నియోజకవర్గం గురించి రాష్ట్రమంతా చర్చ జరుగుతోంది. కామారెడ్డిలో కేసీఆర్‌ పోటీ చేయాలని గోవర్దన్‌ అడుగుతారని నేను అనుకోలేదు. కామారెడ్డి నియోజకవర్గం నంబర్‌ వన్‌గా ఉండాలనే కేసీఆర్‌ను పోటీ చేయమని అడిగారు. కామారెడ్డి నియోజవర్గంతో కేసీఆర్‌కు ఎనలేని బంధం ఉంది. కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా బలమైన ఆశయం.. దృఢమైన సంకల్పం ఉంటుంది. కేసీఆర్‌ నిర్ణయాలు సంచలనంగా ఉంటాయి. బలమైన ఆశయంతో కామారెడ్డి నుంచి కేసీఆర్‌ పోటీ చేస్తున్నారు. - మంత్రి కేటీఆర్

KTR Speech at Kamareddy Public Meeting ఆ కారణంతోనే కేసీఆర్‌ కామారెడ్డి నుంచి పోటీకి దిగుతున్నారు కేటీఆర్

KTR Comments on Congress and BJP : కాంగ్రెస్​ తరఫున గెలిచిన వాళ్లు.. బీజేపీలోకి జంప్‌ అవుతారు: మంత్రి కేటీఆర్

కేసీఆర్ కామారెడ్డికి రావడంతో ప్రతిపక్షాల గుండెలు అదురుతున్నాయని కేటీఆర్‌ పేర్కొన్నారు. పదేళ్ల స్వల్ప కాలంలో వందేళ్ల ప్రగతిని పరిచయం చేశామని వివరించారు. కేసీఆర్‌ను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు.‌ హ్యాట్రిక్‌ సీఎంగా కేసీఆర్‌ను నిలపాలన్నారు. చరిత్రను తిరగరాసే అవకాశాన్ని కామారెడ్డికి ఇచ్చారని.. కేసీఆర్ విజయం ఎప్పుడో ఖాయమైందని తెలిపారు. తేలాల్సింది మెజార్టీ మాత్రమేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో గెలిచి మహారాష్ట్రలో సత్తా చాటాలని ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్​ఎస్ దేశంలో కీలక పాత్ర పోషించాల్సి ఉందని.. మహారాష్ట్ర ప్రజలు కేసీఆర్ వైపు చూస్తున్నారని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

Minister KTR Speech at Nirmal BRS Public Meeting : 'మేం అభివృద్ధి చేశామని నమ్మితేనే ఓట్లు వేయండి.. లేకుంటే లేదు..'

కేసీఆర్ కామారెడ్డికి రావడంతో ప్రతిపక్షాల గుండెలు అదురుతున్నాయి. పదేళ్ల స్వల్ప కాలంలో వందేళ్ల ప్రగతిని పరిచయం చేశాం. కేసీఆర్‌ను అఖండ మెజార్టీతో గెలిపించాలి. హ్యాట్రిక్‌ సీఎంగా కేసీఆర్‌ను నిలపాలి. కేసీఆర్ విజయం ఎప్పుడో ఖాయమైంది.. తేలాల్సింది మెజార్టీ మాత్రమే. రాష్ట్రంలో గెలిచి మహారాష్ట్రలో సత్తా చాటాలి. బీఆర్​ఎస్ దేశంలో కీలక పాత్ర పోషించాల్సి ఉంది. మహారాష్ట్ర ప్రజలు కేసీఆర్ వైపు చూస్తున్నారు. - కేటీఆర్‌, ఐటీ, పురపాలక శాఖ మంత్రి

KTR Fires on Modi in Twitter : "బరాబర్​ మాది కుటుంబపార్టీయే.. రాష్ట్రమే మా కుటుంబం"

Last Updated :Oct 7, 2023, 4:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.