ETV Bharat / state

కాంగ్రెస్ శ్రేణుల ప్లెక్సీ వివాదం.. వాహనంపై తెరాస ఎమ్మెల్యే స్టిక్కర్

author img

By

Published : Mar 18, 2022, 4:11 PM IST

Congress flexi issue: కామారెడ్డిలో కాంగ్రెస్ శ్రేణుల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు మరోసారి బయటపడింది. మన ఊరు-మన పోరు కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తుండగా వివాదం తలెత్తింది. సుభాష్ రెడ్డి, మదన్ మోహన్​రావు వర్గీయులు మరోసారి ఘర్షణకు దిగారు.

Congress flexi issue
కాంగ్రెస్ శ్రేణుల ప్లెక్సీ వివాదం

Congress flexi issue: కామారెడ్డి జిల్లాలో మార్చి 20న జరగాల్సిన కాంగ్రెస్ మన ఊరు-మన పోరు కార్యక్రమంపై వివాదం నెలకొంది. ఎల్లారెడ్డిలో జరిగే ఈ సభకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాజరు కానుండగా.. ఇందుకు కాంగ్రెస్ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నారు.

ఎమ్మెల్యే పేరుతో స్టిక్కర్..

ఇప్పటికే అక్కడ సుభాష్ రెడ్డి, మదన్ మోహన్​రావుల మధ్య అధిపత్య పోరు సాగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి ఎర్రబెల్లికి సంబంధించిన ఎమ్మెల్యే స్టిక్కర్​తో ఉన్న కారులో వచ్చిన కొందరు ప్లెక్సీలు కట్టేందుకు ప్రయత్నించగా సుభాష్ రెడ్డి వర్గం అడ్డుకుంది. ఈ నేపథ్యంలో కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది.

కారులో వచ్చిన వారిని కాంగ్రెస్ నాయకులు పట్టుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. మంత్రి ఎర్రబెల్లికి మదన్ మోహన్ రావు మేనల్లుడు కావడంతో వివాదం మరింత రాజుకుంది. గత ఎన్నికల్లో జహీరాబాద్ లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీ చేసిన మదన్ మోహన్​రావు.. ప్రస్తుతం ఎల్లారెడ్డి అసెంబ్లీ సీటుపై దృష్టి పెట్టడంతో గ్రూపు రాజకీయాలు ఏర్పడ్డాయి.

కామారెడ్డిలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన

ఇదీ చదవండి:జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. పసికందు మృతి.. వాహనంపై ఎమ్మెల్యే స్టిక్కర్​.!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.