ETV Bharat / state

'పాఠశాలలు మూసేయటం అంధకారంలోకి నెట్టేయటమే'

author img

By

Published : Nov 27, 2019, 7:23 PM IST

కామారెడ్డిలో ఏబీవీపీ ఆందోళన
కామారెడ్డిలో ఏబీవీపీ ఆందోళన

ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏబీవీపీ కార్యకర్తలు విద్యార్థులతో కలిసి సర్కారు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే ఆలోచనను ముఖ్యమంత్రి కేసీఆర్ మానుకోవాలని ఏబీవీపీ కార్యకర్తలు విజ్ఞప్తి చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తా వద్ద ఏబీవీపీ కార్యకర్తలు.. విద్యార్థులతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పక్క దేశాల్లో 20 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండగా.. రాష్ట్రంలో 50 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉన్నాడని వాపోయారు. పాఠశాలలు తీసివేయడం వల్ల విద్యార్థులు ఎక్కువ ఉపాధ్యాయులు తక్కువ అవుతారని హెచ్చరించారు. విద్య అందకపోవడం వల్ల అజ్ఞాన అంధకారంలోకి నెట్టేసినట్లవుతుందని గమనించాలని కోరారు. పాఠశాలలను మూసివేసే ఆలోచనను మానుకోవాలని సూచించారు.

కామారెడ్డిలో ఏబీవీపీ ధర్నా

ఇదీ చూడండి: జేబీఎస్​ వద్ద రెండో రోజూ కార్మికుల అరెస్ట్

Intro:tg_nzb_02_27_kcr_bomma_tirigela_dagdam_avb_ts10142
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తా వద్ద ఏబీవీపీ కార్యకర్తలు స్థానిక పాఠశాల విద్యార్థులతో కలిసి కెసిఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు కెసిఆర్ ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే ఆలోచన మానుకోవాలని 12 వేల పాఠశాలలు మూసి వేయడం వల్ల పేద విద్యార్థులు చదువు లేని నిరుపేదలు అవుతారని డబ్బులు లేక పోయినా పర్వాలేదు కానీ చదువు లేకపోతే ఇబ్బంది అవుతుందని ,ఈ విషయాన్ని కెసిఆర్ గమనించాలని పక్క దేశాలు 20 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండగా అలాంటి మన రాష్ట్రంలో లో 50 మంది పైగా విద్యార్థులకు ఉపాధ్యాయుడు ఉన్నాడని ఇలా పాఠశాలలు తీసివేయడం వల్ల విద్యార్థులు ఎక్కువ ఉపాధ్యాయులు తక్కువ అవ్వడం వల్ల విద్యార్థులకు సరిగ్గా విద్య అందకపోవడం వల్ల వారు అజ్ఞాన అంధకారం లోకి నెట్టి వేయబడతారని ఈ విషయాన్ని గమనించి అలాగే, పాఠశాల తీసివేయడం వల్ల ఉపాధ్యాయులు కూడా పని లేక పోవడం వల్ల కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు ఉద్యోగాలు దొరకక నిరుద్యోగ రేటు పెరిగి అది ఆర్థిక అణచివేతకు కారణం అవుతుందని తెలిపారు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టి లో పెట్టుకుని ఆలోచన మానుకోవాలని కోరారు....


Body:shyamprasad goud


Conclusion:7995599833
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.