ETV Bharat / state

జేబీఎస్​ వద్ద రెండో రోజూ కార్మికుల అరెస్ట్​

author img

By

Published : Nov 27, 2019, 1:11 PM IST

జేబీఎస్​లోని కంటోన్మెంట్​ పికెట్​ డిపో వద్ద విధులకు హాజరయ్యేందుకు వచ్చిన ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. డిపో వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

2nd day Arrest of rtc workers at JBS
జేబీఎస్​ వద్ద రెండో రోజూ కార్మికుల అరెస్ట్​

సమ్మె విరమించిన ఆర్టీసీ కార్మికులు రెండో రోజూ విధులకు హాజరయ్యేందుకు డిపోలకు తరలివస్తున్నారు. జేబీఎస్​లోని కంటోన్మెంట్​ పికెట్​ డిపో వద్ద విధులకు హాజరయ్యేందుకు వచ్చిన 11 మంది కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారిని బొల్లారం పోలీస్​ స్టేషన్​కు తరలించారు.

మరోవైపు సమ్మె విరమించి విధుల్లో చేరేందుకు వచ్చిన తమను అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసం అని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ తమ పట్ల దయ చూపి తమను విధులకు అనుమతించాలని కోరారు.

పోలీసుల భారీ బందోబస్తు మధ్య రోజు మాదిరిగానే తాత్కాలిక సిబ్బందితో బస్సులు యధావిధిగా నడుస్తున్నాయి.

జేబీఎస్​ వద్ద రెండో రోజూ కార్మికుల అరెస్ట్​

ఇవీ చూడండి: 'మిషన్' పూర్తి చేసిన పీఎస్​ఎల్వీ.. కక్ష్యలోకి కార్టోశాట్-3

Intro:సికింద్రాబాద్ యాంకర్.. సమ్మె విరమించి విధుల్లో చేరేందుకు వచ్చిన ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు..జేబీఎస్ లోని కంటోన్మెంట్ పికెట్ డిపో వద్ద నిన్నటి లాగే విధులకు హాజరయ్యేందుకు వచ్చిన 11 మంది కార్మికులను పోలీసులు అరెస్టు చేసి బొల్లారం పీఎస్ కి తరలించారు..తమ విధులకు హాజరయ్యేందుకు వస్తే ప్రభుత్వం పోలీసులు అడ్డుకోవడం ఎంత వరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు ..ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమించిన ప్రభుత్వం దిగి రాక పోవడం వారిని విధుల్లో చేర్చుకునేందుకు నిరాకరించడం సరైన చర్య కాదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..వెంటనే తమను విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు..జె.బి.ఎస్ డిపోల వద్ద పెద్దఎత్తున పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు..ముఖ్యమంత్రి కెసిఆర్ ఆర్టీసీ కార్మికుల పట్ల వివక్ష చూపడం సహేతుకమైన చర్య కాదని మానవతా దృక్పథంతో సమ్మె విరమించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని వారు కోరారు.. సీఎం కేసీఆర్ మొండి వైఖరి విడనాడి ఆర్టీసీ కార్మికులను తిరిగి విధుల్లోకి చేర్చుకోవాలని కోరారు..ప్రైవేటు కార్మికులతో ఆర్టిసి బస్సులను యధాతథంగా నడుపుతున్నారు ..Body:VamshiConclusion:70323010099
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.