ETV Bharat / international

ప్రధాని​ కంటే భార్య సంపాదనే ఎక్కువ- 'రిచ్ లిస్ట్'​లో ఈ కపుల్​ ఎన్నో స్థానంలో ఉందంటే? - Rishi Sunak Akshata Net Worth

author img

By ETV Bharat Telugu Team

Published : May 17, 2024, 5:13 PM IST

Rishi Sunak Akshata Murthy Wealth : సరిగ్గా రెండేళ్ల క్రితం 'సండే టైమ్‌ రిచ్‌ లిస్ట్‌'లో స్థానం దక్కించుకున్న బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌-అక్షతామూర్తి, ఈ ఏడాది ర్యాంకింగ్స్​లో మరింత పైకి ఎగబాకారు. అక్షతా మూర్తికి తన తండ్రి నారాయణమూర్తి స్థాపించిన ఇన్ఫోసిస్‌లో ఉన్న షేర్ల కారణంగా ఈ జంట 10 డౌనింగ్ స్ట్రీట్‌లో అత్యంత సంపన్న వ్యక్తులుగా నిలిచారు.

Rishi Sunak Akshata Murthy
Rishi Sunak Akshata Murthy (Source : Getty Images)

Rishi Sunak Akshata Murthy Wealth : బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌- అక్షతామూర్తి దంపతులు 2024 సండే టైమ్‌ రిచ్‌ లిస్ట్‌ ర్యాంకింగ్స్​లో మరింత పైకి ఎగబాకారు. ఇన్ఫోసిస్‌లో షేర్ల కారణంగా వీరి ఆదాయం భారీగా పెరిగింది. గత ఏడాది 651 మిలియన్ల పౌండ్ల సంపదతో 275వ స్థానంలో నిలిచిన రిషి సునాక్‌- అక్షతామూర్తి జంట, ఈ ఏడాది 245వ స్థానాన్ని దక్కించుకుంది. దీంతో వీరు బ్రిటన్ చరిత్రలో అత్యంత సంపన్న ప్రధాన మంత్రి దంపతులుగా నిలిచారు.

భర్త కంటే భార్య సంపాదనే ఎక్కువ
ఫిబ్రవరిలో వచ్చిన ఓ ఆర్థిక నివేదిక ప్రకారం అక్షతామూర్తి సంపాదన ఆమె భర్త రిషి సునాక్‌ కంటే ఎక్కువ. రిషి సునాక్ 2022-23లో 2.2 మిలియన్ల పౌండ్లు సంపాదిస్తే, గత ఏడాది అక్షతా మూర్తి 13 మిలియన్ పౌండ్లను ఆర్జించారు. బ్రిటన్‌ దంపతుల అత్యంత విలువైన ఆస్తి ఇన్ఫోసిస్‌లో అక్షతామూర్తికి ఉన్న వాటా. ఆమె తండ్రి నారాయణమూర్తి స్థాపించిన ఈ కంపెనీలో ఉన్న షేర్ల వల్ల అక్షతా మూర్తికి అత్యధిక సంపాదన సమకూరుతోంది.

గత ఏడాది ఇన్ఫోసిస్‌ షేర్ల విలువ 108.8 మిలియన్‌ పౌండ్ల నుంచి దాదాపు 590 మిలియన్‌ పౌండ్లకు పెరిగింది. ఆ సమయంలో అక్షత 13 మిలియన్ల పౌండ్ల డివిడెండ్‌లను అందుకున్నారని సండే టైమ్‌ రిచ్‌ లిస్ట్‌ తాజా వార్షిక నివేదిక వెల్లడించింది. ఇప్పటివరకు ఒక ఏడాదిలో ఆమె అందుకున్న అత్యధిక పారితోషకం ఇదే. అక్షతామూర్తి ఈ ఏడాది మరో 10.5 మిలియన్‌ పౌండ్లను అందుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.

అగ్రస్థానంలో హిందూజ కుటుంబం
బ్రిటన్‌లోని అత్యంత సంపన్న కుటుంబాల్లో హిందూజ కుటుంబం ఒకటి. ఈ ఏడాది ప్రచురించిన సండే టైమ్‌ రిచ్‌ లిస్ట్‌లో హిందూజ కుటుంబం మరోసారి అగ్రస్థానంలో ఉంది. గత ఏడాది కాలంలో హిందూజ కుటుంబ సంపద 37.196 బిలియన్‌ పౌండ్లకు చేరింది. హిందూజ కుటుంబం ఆటోమోటివ్, ఆయిల్ స్పెషాలిటీ కెమికల్స్, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఐటీ, సైబర్ సెక్యూరిటీ, హెల్త్‌కేర్, ట్రేడింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్, మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్, పవర్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలను 48 దేశాల్లో నిర్వహిస్తూ భారీగా ఆదాయం అర్జిస్తోంది.

టాప్‌ టెన్‌లో ఎవరంటే?
2024 సండే టైమ్స్ రిచ్ లిస్ట్​లో టాప్ 10లో భారత్‌లో జన్మించిన డేవిడ్, సైమన్ రూబెన్ సోదరులు కూడా స్థానం సంపాదించారు. గత ఏడాది నాలుగో స్థానంలో ఉన్న వీరు, ఈ ఏడాది మూడో స్థానానికి ఎగబాకారు. వీరి సంపద సుమారు 24.977 బిలియన్‌ పౌండ్లుగా అంచనా వేశారు. ఆర్సెలార్‌ మిత్తల్ స్టీల్‌ వర్క్స్‌ అధిపతి లక్ష్మీ ఎన్. మిత్తల్ ఈ జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉన్నారు. గత ఏడాది ఆరో స్థానంలో ఉన్న మిత్తల్‌, ఈసారి ఎనిమిదో స్థానానికి పడిపోయారు. వేదాంత రిసోర్సెస్ అధిపతి అనిల్ అగర్వాల్ 7 బిలియన్‌ పౌండ్ల సంపదతో 23వ స్థానంలో ఉన్నారు.

2024 జాబితాలోని భారతీయ సంతతికి చెందిన బిలియనీర్‌లలో టెక్స్‌టైల్స్ వ్యవస్థాపకుడు ప్రకాశ్ లోహియా 6.23 బిలియన్లతో 30వ స్థానంలో ఉన్నారు. వంద మంది సంపన్న బ్రిటిషర్లలో సైమన్, బాబీ, రాబిన్ అరోరా సోదరులు 2.682 బిలియన్ పౌండ్ల సంపదతో 65వ స్థానంలో ఉన్నారు. ఫ్యాషన్ పారిశ్రామికవేత్త సుందర్ జెనోమల్ 2.214 బిలియన్ల సంపదతో 77వ స్థానంలో ఉన్నారు.

ఆసియా కుబేరుల జాబితాలో బ్రిటన్ ప్రధాని సునాక్‌, అక్షత.. తొలిసారిగా..

'దుస్తులు, బూట్లు ఎక్కడపడితే అక్కడే.. ఓరి దేవుడా!'.. భార్య గురించి రిషి సునాక్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.