ETV Bharat / state

'ఉన్నత చదువులతో మన బతుకులు మనమే మార్చుకోవాలి'

author img

By

Published : Jan 15, 2021, 8:57 AM IST

స్వేరో అనేది కులానకి మతానికి సంబందించినది కాదని రాష్ట్ర ఎస్​సీ, ఎస్​టీ గురుకులాల కార్యదర్శి ఆర్​ఎస్​ ప్రవీణ్ కుమార్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో అన్ని వసుతులు కల్పిస్తున్న గురుకులను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉన్నత చదువులతో మన బతుకులు మనమే మార్చుకోవాలని సూచించారు.

Swaroo festival was celebrated In the town of Alampur in Jogulamba Gadwal district
'ఉన్నత చదువులతో మన బతుకులు మనమే మార్చుకోవాలి'

జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ పట్టణంలో స్వేరోస్ సంబరాలను ఘనంగా నిర్వహించారు. 'అందరూ చదువు కోవాలి చదువు కుంటేనే జీవితం' అనే నినాదంతో స్వేరోను స్థాపించి విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి కృషి చేస్తున్న ప్రవీణ్ కుమార్​కి... ముఖ్య అతిథులుగా హాజరైన పలువురు ఎమ్మెల్యేలు అభినందనలు తెలిపారు. ప్రభుత్వ హాస్టళ్లలో చేరాలంటే భయబడే రోజులుపోయి ప్రస్తుతం గురుకుల పాఠశాలలో చేరేందుకు పోటీ పడే స్థాయికి తెలంగాణ గురుకుల పాఠశాలలు చేరుకోవడంలో ప్రవీణ్ కుమార్ కృషి ఎంతో ఉందని కొనియాడారు. గురుకులాల్లో కోచింగ్ తీసుకుని మెడికల్ సీట్లు సాధించిన విద్యార్థులకు ప్రశంస పత్రాలు అందజేశారు.

స్వేరో అనేది కులానకి మతానికి సంబందించినది కాదని రాష్ట్ర ఎస్​సీ, ఎస్​టీ గురుకులాల కార్యదర్శి ఆర్​ఎస్​ ప్రవీణ్ కుమార్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో అన్ని వసుతులు కల్పిస్తున్న గురుకులను అందరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉన్నత చదువులతో మన బతుకులు మనమే మార్చుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు మారాలి ప్రతి ఇళ్లు ఒక లైబ్రరీ కావాలని అన్నారు. అందరు మారండి పిల్లలను చదివించండని స్థానికులను కోరారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీసీ గురుకుల కార్యదర్శి మల్లయ్య బట్టు, జడ్పీ చైర్ పర్సన్ సరిత, కర్నూల్ ఎమ్మెల్యే హఫిజ్ ఖాన్, అలంపూర్ ఎమ్మెల్యే అబ్రాహం, వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్, రాష్ట్ర మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మి బాయ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.