ETV Bharat / state

మినీ మేడారం మొదలైంది

author img

By

Published : Feb 21, 2019, 6:50 AM IST

Updated : Feb 21, 2019, 9:11 AM IST

తెలంగాణ కుంభమేళాగా పిలువబడే సమ్మక్క, సారలమ్మ చిన్న జాతర మొదటి రోజు ఘనంగా జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో మేడారం పరిసరాలు కిక్కిరిసిపోయాయి.

ప్రారంభమైన చిన్న జాతర

మేడారంలో సమ్మక్క, సారలమ్మ చిన్న జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. రెండేళ్లకోసారి జరిగే పెద్ద జాతర మరుసటి సంవత్సరం ఈ చిన్న జాతర జరుగుతుంది. మాఘ శుద్ధ పౌర్ణమి తర్వాత వచ్చే బుధవారాన్ని పవిత్రంగా భావించి అర్చకులు మండమెలిగె పండుగ పేరుతో జాతరను జరుపుతారు. తెలంగాణ ఆదివాసీల సంప్రదాయాలకు అద్దం పట్టే ఈ జాతర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని అర్చకులు ఘనంగా పూజలు చేశారు. సమ్మక్క సారలమ్మ ఆలయాలను భక్తి శ్రద్ధలతో శుద్ధి చేశారు.

ప్రారంభమైన చిన్న జాతర

వివిధ ప్రాంతాల నుంచి భక్తులు...

మొదటి రోజుమేడారం పరిసరాలన్నిపెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులతో కిటకిటలాడాయి. జంపన్నవాగు, గద్దెల వద్ద భక్తుల రద్దీ అధికంగా కనిపించింది. ఎండ తగలకుండా గద్దెల వద్ద అధికారులు చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసిన భక్తులు గద్దెల చెంత పసుపు, కుంకుమలతో సమ్మక్క, సారలమ్మలకు పూజ చేసి బెల్లాన్ని కానుకగా సమర్పించారు. హైదరాబాద్‌, ముంబయి, ఛత్తీస్‌గఢ్​ తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు జాతరకు తరలివచ్చారు. అమ్మల దర్శనం బాగా జరిగిందని...సౌకర్యాలు బాగున్నాయని భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:కీలక ఒప్పందాలు..ద్వైపాక్షిక చర్చలు

Intro:TG_KRN_102_20_NUTHANA PHC PRARAMBAM_PS SHANKUSTHAPANA_AVB_C11
FROM:KAMALAKAR HUSNABAD C11
---------------------------------------------------------------------------- సిద్దిపేట్ జిల్లా హుస్నాబాద్ డివిజన్ అక్కన్నపేట మండల కేంద్రంలో ఎమ్మెల్యే సతీష్ కుమార్ నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం సిద్దిపేట జిల్లా సిపి జోయల్ డేవిస్ గారితో కలిసి మండల కేంద్రానికి నూతన పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా అక్కన్నపేట మండలానికి నూతన ఎం ఆర్ సి కేంద్ర భవన నిర్మాణ శంకుస్థాపన కూడా చేశారు. ఈ సందర్భంగా సిపి జోయల్ డేవిస్ గారు మాట్లాడుతూ తాను ఉమ్మడి కరీంనగర్ సిపి గా ఉన్నప్పుడు అక్కన్నపేట కు ఒక్కసారి కూడా రాలేదని గౌరవ ముఖ్యమంత్రి గారు నూతన జిల్లాలను ఏర్పరచడం తో సిద్దిపేట జిల్లా అయిన తర్వాత ఈ అక్కన్నపేట గ్రామానికి మూడు నాలుగు సార్లు వచ్చి వెళ్లడం జరిగిందని, ఈ విధంగా పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పరచడం తో కొత్త మండలం గా ఏర్పడిన అక్కన్నపేట మండలానికి పలుమార్లు వచ్చే అవకాశం ఏర్పడిందని తెలుపుతూ త్వరగా పోలీస్ స్టేషన్ భవన నిర్మాణాన్ని పూర్తి చేసి మండల ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని తెలిపారు. అనంతరం హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారు మాట్లాడుతూ అక్కన్నపేట సర్పంచ్ సంజీవ రెడ్డి గారు గ్రామంలో ఏ పనులు అవసరం ఉన్నాయో ఆ పనులను కోరిన విధంగా త్వరలోనే ఒక్కొక్కటిగా పూర్తి చేస్తానని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారిని, సీపీ జోయల్ డేవిస్ గారిని అక్కన్నపేట సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు సన్మానించడం జరిగింది.


Body:బైట్స్

1)సిద్దిపేట సిపి జోయల్ డేవిస్

2) హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్


Conclusion:అక్కన్నపేట మండలంలో వివిధ భవనాల ప్రారంభం శంకుస్థాపన
Last Updated : Feb 21, 2019, 9:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.